ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులపై కసరత్తులు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మరోపక్క “సిద్ధం” అంటూ కేడర్ తో భారీస్థాయిలో మీటింగులు పెడుతున్నారు జగన్! ఇదే సమయంలో “రా.. కదలిరా” అంటూ చంద్రబాబు జనాల్లో తిరుగుతున్నారు.. మరోపక్క అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు! ఈ సమయంలో జనసేనతో సీట్ల సర్ధుబాటు గరం గరంగా సాగుతుందని అంటున్నారు.
ఇప్పటికే మండపేట, అరకు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించేశారు చంద్రబాబు. దీంతో అలిగారో, హర్ట్ అయ్యారో తెలియదు కానీ… రాజోలు, రాజానగరం అంటూ తానో రెండు సీట్లు ప్రకటించేసుకున్నారు పవన్ కల్యాణ్. అయినా తగ్గని బాబు.. తాజాగా మూడో సీటూగా నూజివీడు ప్రకటించేశారు. దీంతో… పొత్తుధర్మం అనే కాన్సెప్ట్ పక్కకు పోయిందని అంటున్నారు పరిశీలకులు. మరి నూజివీడుపై పవన్ రియాక్షన్ ఏమిటనేది వేచి చూడాలి.
ఈ సందర్భంగా టీడీపీ – జనసేన పొత్తు సాగినా, వీగినా అందుకు ప్రధానంగా 20 సీట్లు కారణం కావొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఎలాగూ జనసేనకు 20 దగ్గర మొదలుపెట్టి 25 దగ్గర ఆపి.. వాటికి మరో రెండు ఎంపీ సీట్లు వేసి ఇవ్వాలని టీడీపీ భావిస్తుందని అంటున్నారు. ఈ సమయంలో ప్రధానంగా టీడీపీ – జనసేన మధ్య 20 సీట్లు అగ్గి రాజేస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు అవేంఇటనేది చూద్దాం…!
ఈ 20 స్థానాల్లోనూ రెండు పార్టీల మధ్య ఒక స్పష్టత వస్తే కచ్చితంగా పొత్తు నిలబడే అవకాశం ఉందని.. అలాకాని పక్షంలో కచ్చితంగా ఇబ్బందులు తప్పకపోవచ్చని చెబుతున్నారు. ఈ సమయంలో… ఏమి జరగనుంది.. ఎలా జరగనుంది9.. ఎవరు తగ్గుతారు.. ఎవరు పట్టు వీడకుండా ఉంటారు అనేది ఆసక్తిగా మారింది. ఇంతకూ అంత హాట్ టాపిక్ గా మారిన ఆ 20 సీట్లు ఏమిటంటే…
భీమిలి – గంటా శ్రీనివాసరావు (టీడీపీ) / పంచకర్ల సందీప్ (జనసేన)
పెందుర్తి – బండారు సత్యనారాయణ (టీడీపీ) / పంచకర్ల రమేశ్ (జనసేన)
కాకినాడ – కొండబాబు (టీడీపీ) / ముత్తా శశిధర్ (జనసేన)
పిఠాపురం – ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ (టీడీపీ) / తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (జనసేన)
రాజానగరం – బొడ్డు వెంకటరమణ (టీడీపీ) / బత్తుల బలరామకృష్ణ (జనసేన)
రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ) / కందుల దుర్గేశ్ (జనసేన)
అమలాపురం – ఆనందరావు (టీడీపీ) / రాజబాబు (జనసేన)
రాజోలు – గొల్లపల్లి సూర్యారావు (టీడీపీ) / బొంతు రాజేశ్వర రావు (జనసేన)
నర్సాపురం – బండారు మాధవనాయుడు (టీడీపీ) / బొమ్మిడి నాయికర్ (జనసేన)
తణుకు – అరుమిల్లి రాధాకృష్ణ (టీడీపీ) / విడివాడ రామచంద్రరావు (జనసేన)
ఉంగుటూరు – గన్ని ఆంజనేయులు (టీడీపీ) / పి.దర్మరాజు (జనసేన)
అవనిగడ్డ – మండలి బుద్దప్రసాద్ (టీడీపీ) / రామకృష్ణ (జనసేన)
పెడన – కాగిత కృష్ణప్రసాద్ (టీడీపీ) / బూరగడ్డ వేదవ్యాస్ (జనసేన)
విజయవాడ వెస్ట్ – బుద్దా వెంకన్న (టీడీపీ) / పోతిన మహేశ్ (జనసేన)
గుంటూరు వెస్ట్ – కోవెలమూడి రవీంద్ర (టీడీపీ) / బోనబోయిన శ్రీనివాస యాదవ్ (జనసేన)
చీరాల – కొండయ్య యాదవ్ (టీడీపీ), ఆమంచి స్వాములు (జనసేన)
నర్సారావుపేట – నల్లపాటి రాము (టీడీపీ) / సుభాణి (జనసేన)
తెనాలి – ఆలపాటి రాజా (టీడీపీ) / నాదెండ్ల మనోహర్ (జనసేన)
నెల్లిమర్ల – బంగార్రాజు(టీడీపీ) / లోకం మాధవి (జనసేన)
ధర్మవరం – పరిటాల శ్రీరాం లేదా గోనుగుంట్ల సూర్యనారాయణ (టీడీపీ) / మధుసూదన్ రెడ్డి (జనసేన)