ఆంధ్రప్రదేశ్: బీజేపీ నేతలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను, టీడీపీ ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే వాళ్ళు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక వైసీపీ చేస్తున్న తప్పులకు కూడా టీడీపీనే కారణం అనే విధంగా వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకునేది. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో గాని చాలా మంది నేతలు మాట్లాడటం లేదు. టీడీపీ మాట వింటే చాలు పూనకం వచ్చినట్లు ఊగిపోయే విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు, మాధవ్ లాంటి నేతలు సైలెంట్ అయిపోయారు.స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అధికార పార్టీనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.
టీడీపీని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు వాళ్ళు. దీనితో అసలు ఎం జరుగుతుందో అర్ధం కావడం లేదు. ఇక తాజాగా చంద్రబాబు ని ఉద్దేశించి సోము వీర్రాజు ప్రసంశలు కూడా కురిపించారు. మూడు నెలలకు ఒకసారి గ్రామ సభ జరగాలని చంద్రబాబు కోరుకున్నారు అంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. వాజపేయి ఆలోచనలు అమలు కావాలని చంద్రబాబు కోరుకున్నారని అందుకే జన్మభూమి తీసుకొచ్చారని అన్నారు. చంద్రబాబు పాలనే ఒకరకంగా బాగుంది అంటూ పరోక్ష వ్యాఖ్యలు కూడా సోము చేశారు. దీనితో అసలు ఏపీ బిజెపికి ఏమైంది అంటూ అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే… ఈ పరిణామాలు టీడీపీకి ఆసక్తిగా ఉంటే జగన్ కు మాత్రం ఇబ్బందిగా ఉన్నాయి.