గోషామహల్ ముఖేష్ గౌడ్ కు సొంత కేడర్ షాక్ (వీడియోలు)

కాంగ్రెస్ పార్టీలో ఉండాలా లేదా అన్న మీమాంసలో ఉన్నారు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్. ఆయన టిఆర్ఎస్ లోకి పోతారన్న ప్రచారం జోరందుకున్నది అప్పట్లో. కానీ ఆయన ఇంకా టిఆర్ఎస్ గూటికి చేరలేదు. కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో యాక్టీవ్ పొజిషన్ కు రాలేకపోతున్నారు. మళ్లీ ఏదైనా జరుగుతుందా అన్న అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో గోషా మహల్ లో ఓడిపోయిన తర్వాత నాలుగున్నరేళ్ల పాటు ముఖేష్ గౌడ్ కేడర్ కు ముఖం చూపించలేదని ఆయన అనుచరులు గరం అయితున్నారు. తీరా ఎన్నికలు వచ్చే సమయంలో ముఖేష్ గౌడ్ బయటకొచ్చారని వారు ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ లో నాకో సీటు, నా కొడుకుకో సీటు అంటూ అధిష్టానంతో సంప్రదింపులు చేస్తున్నారని, ఇన్నేళ్లు కేడర్ ను పట్టించుకోలేదని వారు ఆగ్రహంగా ఉన్నారు.

సుమారు వంద మంది గోషా మహల్ కాంగ్రెస్ నేతలు సమావేశమై ముఖేష్ గౌడ్ పై అసమ్మతి ప్రకటించారు. ముఖేష్ మీద కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు. మెమోరాండం రెడీ చేసుకుని రేపో మాపో కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచలో ఉన్నారు. ఈ అసమ్మతి నేతల సమావేశం గౌలిగూడ వెంకటేశ్వర ప్రెస్ లో జరిగింది.

mukesh goud 2

ఈ సమావేశంలో ముఖేష్ గౌడ్ పై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నాయకులు. ఇన్నేండ్లు ఎక్కడ పోయిండో ఏమో మమ్మల్ని బాగున్నవా అని కూడా పలుకరించలేదు. ఇప్పుడేమో ఎన్నికల వేళ వచ్చి పోటీ చేద్దామని చూస్తుండు అంటూ సమావేశంలో కేడర్ రగిలిపోయారు.  అంతేకాకుండా ముఖేష్ గౌడ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకుల బండారం బయటపెట్టారు. వీడియోల్లో చూడండి. రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ చరిత్రను మొత్తం కడుపు రగిలిన కార్యకర్తలు బయట పెట్టారు. 

ఇక బంజారాహిల్స్ లో నివాసముండే ముఖేష్ గౌడ్ నాలుగున్నరేళ్ల కాలంలో ఇప్పటి వరకు గోషా మహల్ మొహం కూడా చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖేష్ కొడుకు కూడా ఎన్నడూ కనబడలేదని, ఇప్పుడు మాత్రం పోటీ చేసేందుకు ఉర్కొస్తున్నారని మండిపడ్డారు. ముఖేష్ గోషా మహల్ లో పోటీ చేస్తే తామంతూ మూకుమ్మడి రాజీనామాలకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. అసలు కార్యకర్తలను పట్టించుకోని ముఖేష్ ను గోషా మహల్ లో తిరగనిచ్చే సవాలే లేదని హెచ్చరించారు. 

ముఖేష్ గౌడ్ ఏనాడూ కార్యకర్తల అభ్యున్నతి కోసం పనిచేయలేదన్నారు. అస్తమానం కార్యకర్తలను ఎదగకుండా తొక్కుడే ఆయన పని అని నిప్పులు చెరిగారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదని, కార్యకర్తలను పట్టించుకోలేదని అన్నారు. అందుకే గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారని చెప్పారు.

సమావేశంలో దానం నాగేందర్ ప్రస్తావన

ఈ అసమ్మతి సమావేశంలో మాజీ మంత్రి, ముఖేష్ ఆప్త మిత్రుడు దానం నాగేందర్ ప్రస్తావన కూడా వచ్చింది. దానం నాగేందర్ ను తాము కలిస్తే ముఖేష్ గజ గజ వనికిపోతున్నారని వారు తమ అభిప్రాయాలు చెప్పే సందర్భంలో వెల్లడించారు. ముఖేష్ గౌడ్ మాత్రం అధికార పార్టీ నేతలతో కలవొచ్చు కానీ తాము దానం నాగేందర్ ను కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ఇంకా దానం గురించి ఏమేమ్ మాట్లాడారో వీడియోల్లో చూడొచ్చు.

mukesh goud

 

ముఖేష్ అటో కాలు ఇటో కాలు పెట్టిండు 

ముఖేష్ గౌడ్ ఇప్పటికీ అయోమయంలో ఉన్నాడని కేడర్ మాట్లాడారు. ఆయన ఒక కాలు కాంగ్రెస్ లో మరో కాలు టిఆర్ఎస్ లో పెట్టిండని ఆరోపించారు. నిన్న కూడా టిఆర్ఎస్ ఎంపి బూర నర్సయ్య గౌడ్ ముఖేష్ గౌడ్ కు ఫోన్ చేశాడని చెప్పారు. దాన్నిబట్టి ఆయన ఏ పార్టీలో ఉంటాడో తెలియనప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు ఎలా సపోర్ట్ చేస్తామని వారు నిలదీశారు. తమను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా సరే ముఖేష్ గౌడ్ కు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

అయితే వీరి సమావేశం బట్టి చూస్తే రానున్న ఎన్నికల్లో దానం నాగేందర్ గోషామహల్ లో పోటీ చేయడం ఖాయమైనట్లు కనబడుతున్నది. దానం నాగేందర్ కూడా ఇలాగే ఊగిసలాడి చివరకు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరిపోయారు. కానీ అక్కడ ఆయన పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. 107 టికెట్లు ఖరారు చేసినా దానం సీటు ఖరారు కాలేదు. ఆయన ఖైరతాబాద్ లో పోటీ చేయాలని ఆశతో ఉన్నారు. కానీ ఆయనను గోషా మహల్ పంపే ఆలోచనలో కేసిఆర్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ పరిస్థితుల్లో గోషా మహల్ లో దానం అడుగు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు వీరి సమావేశం ద్వారా తెలుస్తున్నది. కాంగ్రెస్ మనుషులందరినీ దానం తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి గోషా మహల్ లో దోస్తుల మధ్య పోరాటం తప్పదేమో అన్న వాతావరణం నెలకొంది. ఈ అసమ్మతి మీటింగ్ లో పివిి నర్సింహ్మారావు ప్రస్తావన కూడా ఉంది. ఆ వివరాల తాలూకు వీడియోలు కింద ఉన్నాయి చూడండి.

 

mukesh goud 1

 

mukesh goud2