రాజా సింగ్ తెలుసు కదా.? బీజేపీ నుంచి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే. కరడుగట్టిన హిందూ వాది.! ఆయన్ని ‘తీవ్రవాది’ అనే కోణంలో రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. నోటి దురుసు చాలా చాలా ఎక్కువ. ఆ కారణంగానే, బీజేపీ నుంచి సస్పెన్షన్‌కి గురయ్యారాయన.
‘నాకు బీజేపీ నుంచి టిక్కెట్ వచ్చి తీరుతుంది..’ అని మొదటి నుంచీ ఆయన చాలా ధీమాగా వున్నారు.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. బీజేపీ జాతీయ నాయకత్వం దిగొచ్చింది. రాజా సింగ్ మీద సస్పెన్షన్‌ని ఎత్తేసింది. మళ్ళీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఈసారి సంచలనాలు సృష్టిస్తుందని కమలనాథులు గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పనైపోయింది, టీఆర్ఎస్ ఇంటికి వెళ్ళిపోయింది.. అధికార పీఠమెక్కేది తామేనని బీజేపీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు.
బండి సంజయ్ పాదయాత్ర, నిజంగానే తెలంగాణలో బీజపీకి మంచి ఊపు తెచ్చింది. కూర్చున్న కొమ్మని నరికేసుకున్న చందాన, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా వున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని, ఆ పదవి నుంచి బీజేపీ అధినాయకత్వం తొలగించింది.
అంతే, తెలంగాణలో బీజేపీ ఖేల్ ఖతం.! డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎన్నెన్నో చేస్తోంది బీజేపీ. అయినా ఫలితం వుండడంలేదు. రాజా సింగ్‌ని సస్పెండ్ చేసి, మళ్ళీ ఆయన్నే బతిమాలి తెచ్చుకుంటోంది బీజేపీ. తెలంగాణలో బీజేపీ దుస్థితికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?