టీడీపీ హయాంలో చంద్రబాబు కూల్చేసిన దేవాలయాల పునర్నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ఉదయం 11.01 గంటలకు వేద మంత్రోశ్చరణల మధ్య ఆ ఆలయాల పునర్నిర్మాణానికి పునాదిరాయి వేశారు. కృష్ణానది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఉదయం 11.01కి శనైశ్చర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టనున్న ప్రాంతంలో 2 శిలాఫలకాలను సీఎం జగన్ ఆవిష్కరించారు.
దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు–కేతువు, బొడ్డుబొమ్మ, రాతితో శ్రీశనేశ్వర ఆలయం, శ్రీసీతారామ లక్ష్మణ సమేత శ్రీదాసాంజనేయ స్వామి ఆలయం, పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో వీరబాబు ఆలయం, కనకదుర్గ నగర్ లో గోశాల, శ్రీవేణుగోపాలకృష్ణ ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ భూమిపూజ చేశారు. అదే విధంగా రూ.70 కోట్లతో కనకదుర్గమ్మ గుడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
విజయవాడలో పునర్నిర్మాణం చేపట్టే ఆలయాలు..
♦రూ.70 లక్షలతో రాహు-కేతు ఆలయ పునర్నిర్మాణం
♦రూ.9.5 లక్షలతో సీతమ్మ పాదాలు ఆలయ పునర్నిర్మాణం
♦రూ.31.5 లక్షలతో దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం
♦రూ.2 కోట్లతో రాతితో శ్రీ శనీశ్వర ఆలయ పునర్నిర్మాణం
♦రూ.8 లక్షలతో బొడ్డుబొమ్మ ఆలయ పునర్నిర్మాణం
♦రూ.20 లక్షలతో శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం(దుర్గగుడి మెట్ల వద్ద)
♦రూ.10 లక్షలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయ పునర్నిర్మాణం
♦రూ.10 లక్షలతో వీరబాబు ఆలయం పునర్నిర్మాణం (పోలీస్ కంట్రోల్ రూం సమీపంలో)
♦రూ.20 లక్షలతో కనకదుర్గ నగర్‌లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల పునర్నిర్మాణం