మార్పు అంటే ఏంటో చూపిస్తానన్న పవన్.. చిన్న లాజిక్ మాత్రం మిస్సయ్యారే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనను నమ్ముకున్న సినిమా నిర్మాతలకు హ్యాండ్ ఇచ్చారు. హరిహర వీరమల్లు మినహా మరో సినిమాలో తాను ఎన్నికల లోపు నటించే ఛాన్స్ లేదని నిర్మాతలకు తేల్చి చెప్పేశారు. రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కరెక్ట్ కాదని ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తానని పవన్ కామెంట్లు చేస్తున్నారు.

జగనన్న కాలనీల పేరుతో ఏపీలో భారీ స్కామ్ జరిగిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. జనసేన అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తుందని పవన్ పేర్కొన్నారు. పేదల ఇళ్ల కుంభకోణం గురించి మోదీ సర్కార్ కు ఫిర్యాదు చేస్తానని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. జనసేనకు ఒక్క ఛాన్స్ ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఏపీలోని పలు ప్రాంతాలలో ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం గురించి పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ ను ప్రశ్నించడం గమనార్హం. వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని ఆయన సూచనలు చేశారు. ఎవరైతే అవినీతికి పాల్పడతారో వాళ్లను జైలుకు పంపిస్తానని ఆయన పేర్కొన్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం జనసేనకు ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నానని పవన్ కామెంట్లు చేశారు.

అయితే పవన్ కళ్యాణ్ 2024లో ఏ పార్టీతో కలిసి పోటీ చేయనున్నారో మొదట వెల్లడిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జనసేన అధికారంలోకి వచ్చినా వైసీపీ అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తామని చెబుతుండటం గమనార్హం. గతంలో జగన్ సర్కార్ పథకాలను విమర్శించిన జనసేన ఇప్పుడు అవే పథకాలను కొనసాగించడానికి సిద్ధమవుతోంది.