తోలు తీస్తా : ఫ్యాన్స్ కోసం పవన్ లైవ్ లోనే వార్నింగ్

చాలా మంది నాయకులు బెదిరిస్తున్నారు.. మీ పేరు మీద పార్టీ పచ్చబొట్టు పెడితే బెదిరిస్తున్నారు.. వాళ్లు ఎవరైనా సరే సభా ముఖంగా చెప్తున్నాను..మీరు రెచ్చగొడితే..నా కార్యకర్తల మీద చెయ్య వేస్తే.. మీరు గూండాలు కావచ్చేమో..ఏ స్దాయి నాయకులు కావచ్చేమో కానీ, అధికార యంత్రాంగానికి కొమ్మ కాసే వ్యక్తులు కావచ్చేమో కానీ, నేనూ పల్నాడులో పుట్టాను మర్చిపోకండి.

మా వాళ్ల మీద కానీ, ఈ అబ్బాయి మీద కానీ, ఫయాజ్ మీద కానీ చెయ్య వేస్తే..తోలు తీసేస్తాను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. గుంటూరులో నిర్వహించిన సభలో మాట్లాడుతూండగా…గుంటూరు జిల్లా నుంచి వచ్చిన ఫయాజ్ ఆయన్ను కలిసి సమస్య చెప్పగా ఆయన ఇలా స్పందించారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై అన్ని పార్టీలు కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు.

అలాగే జనసేనను అణచివేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పారు. తమను అణచివేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చేసుకోవాలని… వాటికి ప్రతి వ్యూహాలను వేయలేకపోతే తన పేరు పవన్ కల్యాణే కాదని అన్నారు. అమరావతిలో తమ సత్తా ఏంటో చూపిస్తామని… అమరావతిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.

కావాలంటే ఎన్నికల్లో ఎవరికివారు వేర్వేరుగా పోటీ చేద్దామని అన్నారు. తనకు ప్రజలు అండగా లేకపోయినా… జీవితాంతం వారికి తాను అండగానే ఉంటానని చెప్పారు. అధికారం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని… ఆ కోరికే ఉంటే 2009లోనే ఎంపీనో, ఎమ్మెల్యేనో అయ్యుండేవాడినని తెలిపారు.