కాపు రిజర్వేషన్ల మీద పవన్ క్లారిటీ

కాపు రిజర్వేషన్ల మీద జనసేన నేత ఈ రోజు మరింత క్లారిటీ ఇచ్చారు.

కాపు రిజర్వేషన్ల మీద మాట్లాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏ మాత్రం నిజాయితీ లేదని, కేవలం ఓట్ల కోసమే ఆయన కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని ఈ రోజు ఆచంట ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు. కాపు రిజర్వేషన్లు సాధ్యంకాదని ఈ విషయాన్ని ఏ నాడో చంద్రబాబుకు చెప్పి ఆయన ఖాతరు చేయలేదని అన్నారు.కులాల అభివృద్ధి జరగలేదని, కులంలో ఎవరో కొందరు బాగుపడ్తున్నారని చెబుతూ అగ్రకులలాలోని పేదలకోసం,జనసేన అధికారంలోకి వస్తే,  కార్పొరేషన్ ఏర్పాటుచేస్తానని ఆయన ప్రకటించారు. 

‘2014 లోనే చంద్రబాబు గారు వచ్చి కాపు రిజర్వేషన్లు ఇస్తామన్నపుడు అది చెయ్యలేరేమో నేను స్పష్టంగా చెప్పాను. నేను చేస్తాను అన్నాడు, కానీ నా సందేహం సందేహమే నిజమయింది, ’ అని ఆయన అన్నారు. 

కాపుల రిజర్వేషన్ల గురించి ఏమ్మాట్లాడినా నాకు కాపు ముద్రవేస్తారని, అందుకే కాపు రిజర్వేషన్ల మీద ఆచి తూచి మాట్లాడతానని పవన్ చెప్పారు.

‘‘ నేను కాపు రిజర్వేషన్లు గురించి మాట్లాడాలంటే చాలా ఆలోచిస్తాను. ఎందుకంటే, నేను కాపు కులస్థుడ్ని అని అంటారు.మద్దతుగా మాట్లాడితే కుల ముద్ర వేస్తారు, పట్టించుకోకపోతే కుల ద్రోహి అంటారు,’ అని ఆయన చెప్పారు.

‘కానీ నేను కాపు కులానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడకుండా తప్పించుకోలేను. చంద్రబాబు అయినా, జగన్ అయినా కూడా ఓట్ల కోసమే కాపు రిజర్వేషన్లు ఇస్తా మని అన్నారు కాని కాపుల మీద ప్రేమతో కాదు అని కాపులు గుర్తించుకోవాలని ఆయనకోరారు.

నేను ఒక మాట మాట్లాడితే చాలా బాధ్యత తో మాట్లాడుతాను, జగన్, చంద్రబాబు లా నేను మాటలు మార్చనని చెబుతూ  అగ్రకులాల్లో వెనుకబడిన వారికి అండగా నిలబడటానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు.

 బీసీ లకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించే విషయాన్ని జనసేన పార్టీ మ్యానిఫెస్టోలో చేరుస్తానని ఆయన బిసిలకు హామీ ఇచ్చారు.

 

తెలుగుదేశం పార్టీకి బిసిల మీద గౌరవం లేదని చెబుతూ ,నిజంగా తెదేపా వారికి బీసీలపై గౌరం ఉంటే, అది బీసీల పార్టీ అయితే తెలంగాణ నుంచి ఎందుకు గెంటివేయబడ్డారో చెప్పాలన్నారు.

మీ అనుభవాన్నంతా  బీసీ లకు అన్యాయం చేయటానికి ఉపయోగిస్తున్నారని చంద్రబాబును విమర్శించారు.

‘బీసీ లకు ఉన్న రిజర్వేషన్లు సరిపోవు అని వారి కష్టాలు చూసాక అర్థమైంది అది ఎంత శాతం అనేది నేను నిపుణులతో చర్చించి దానికి అనుగుణంగా పెంచేందుకు మ్యానిఫెస్టోలో పెట్టబోతున్నాను. ముస్లిం సోదరులు కోరుకున్నట్లు సచార్ కమిటీ నివేదికను అమలు చేయడం కోసం మ్యానిఫెస్టోలో పెట్టబోతున్నాను.’ అని ఆయన చెప్పారు.