ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ముందూవెనకా పరిస్థితుల గురించి సైతం ఆలోచిస్తాడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ గతంలో తెలుగుదేశం సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ నిర్ణయం వల్ల కాపులకు మేలు జరిగినా ఇతర అగ్ర వర్ణాలకు నష్టం కలుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చెల్లుబాటు అవుతుందని కేంద్రం సైతం అంగీకరించింది.
అయితే చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ఈ రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని భావించిన జగన్ సర్కార్ ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేయడం లేదు. జగన్ సర్కార్ ఈ రిజర్వేషన్లను అమలు చేయకపోవడానికి పొలిటికల్ రీజన్స్ కూడా ఉన్నాయని కొంతమంది భావిస్తారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయం కరెక్ట్ అని కేంద్రం చెప్పిన నేపథ్యంలో జగన్ ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది.
వాస్తవానికి కాపులను బీసీలో చేర్చాలనే డిమాండ్ ఉండగా ఈ డిమాండ్ కు భిన్నంగా రిజర్వేషన్లు అమలవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీలోని కాపు నేతలు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కలిగే బెనిఫిట్ అంతాఇంతా కాదని చెబుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నిర్ణయం అమలు చేయని పక్షంలో కాపులు జగన్ ను శత్రువులా భావించే అవకాశం కూడా ఉంది.
అయితే జగన్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అడుగులు వేసే ధైర్యం పార్టీ నేతలు చేయరనే సంగతి తెలిసిందే. అందువల్ల రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ తీసుకునే ప్రతి నిర్ణయం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.