పాకిస్తాన్ లో భారత్ బొమ్మ పడదు

పాకిస్తాన్ లో భారత్ బొమ్మ పడదు

వెనుకటికెవడో చెఱువు మీద అలిగి నవ్వుల పాలయ్యాడట ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో అదే జరుగుతుంది . కాశ్మీర్ అనేది భారత్ దేశంలో అంతర్భాగం . శాంతి భద్రతల కోసం అనేక మార్పులు చేసుకుంటాం . అయితే కాశ్మీర్ విషయంలో తనని సంప్రదించలేదనేది పాకిస్తాన్ కు కోపం . ఇంత కాలం కాశ్మీర్ బూచి ని చూపిస్తూ పబ్బం గడుపుతూ వస్తోంది . అలాంటి కాశ్మీర్ సమస్య పరిస్కారమైతే ఇక తన ఆటలు సాగవు . అందుకే పాకిస్తాన్ అందుబాటులో వున్న చర్యలు అన్నీ చేపడుతుంది .

పాకిస్థాన్లోని భారత రాయబారిని బహిష్కరించింది . అలాగే భరత్ దేశంలో వున్న పాక్ రాయబారిని వెనక్కు పిలిపించుకుంది . ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలను కాదని కుంది . పాక్ గగన్ తలంపై భారత విమానాలు పోనివ్వమంది . సంఝౌత్ ఎక్సప్రెస్ సేవలను , వ్యాపార లావాదేవీలు వద్దు పొమ్మనండి . ఇక తాజాగా భారత దేశ సినిమాలను పాకిస్తాన్లో విడుదల చెయ్యనివ్వమని ప్రకటించింది . భారత సినిమాల కోసం పాకిస్తాన్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తారు. మన సినిమాలతో పాకిస్తా సినిమాలు ఏరకంగా పోల్చలేము . పైగా మన సినిమాలు పాకిస్తాన్లో విడుదల కాకపోతే మనకొచ్చిన నష్టం ఏమి లేదు . తన చేష్టలతో పాకిస్తాన్ ఇప్పటికే పరువు తీసుకుంటున్నది .