పాదయాత్రలను ప్రజలు నమ్మట్లేదా.. షర్మిల, లోకేశ్ లకు లాభం లేదా?

Khammam, TDP Out.. Sharmila Party In

కొన్నేళ్ల క్రితం వరకు ఎన్నికల ముందు ఎవరు పాదయాత్ర చేస్తే వాళ్లదే అధికారం అనే సెంటిమెంట్ ఉండేది. రాజకియ నేతలు సైతం అప్పట్లో పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే కాలంతో పాటే రాజకీయ నేతల తీరు సైతం మారింది. ప్రస్తుతం రాజకీయ నాయకులలో చాలామంది ప్రజలకు మంచి జరగడం కంటే అధికారమే లక్ష్యంగా పాదయాత్రలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పాదయాత్ర చేసినా ఆ పాదయాత్రకు తగ్గ ఫలితం దక్కలేదు. షర్మిల పార్టీ వల్ల కాంగ్రెస్ ఓట్లు చీలడం మినహా పెద్దగా ఫలితం ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్టీపీ ఒక్క అసెంబ్లీ స్థానంలో అయినా విజయం సాధిస్తుందా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. మరోవైపు లోకేశ్ పాదయాత్ర గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పవచ్చు.

లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకి అణువంతైనా ప్రయోజనం కలిగే అవకాశం దాదాపుగా లేనట్టేనని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో లోకేశ్ తప్పుగా విమర్శలు చేస్తే ఆ విమర్శలు టీడీపీ ఓట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. టీడీపీకి అనుకూలంగా ఉండే వాళ్లు సైతం లోకేశ్ కు భయపడి టీడీపీకి ఓట్లేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.

లోకేశ్ చాలా విషయాలకు సంబంధించి మారాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి కొడుకు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అదే లోకేశ్ కు మైనస్ అయిందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్ ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.