దేవుడా.. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ఇలాంటి బాధ్యతలా జగన్?

ఏపీ సీఎం వైఎస్ జగన్ గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా ప్రజలకు మంచి పాలన అందేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యోగులపై ప్రస్తుతం అదనపు భారం పడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాలకు సంబంధించిన బాధ్యతలను ఏపీ సర్కార్ ఉద్యోగులకు అప్పగించింది. ప్రభుత్వం కోరిన వివరాలను ఈ ఉద్యోగులు ప్రభుత్వం రూపొందించిన స్పెషల్ యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలపై ఈ భారం పడనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగులు హాజరు తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లీదండ్రులతో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. మధ్యాహ్న భోజన రికార్డులను పరిశీలించడంతో పాటు భోజనం రుచిగా, శుచిగా ఉందా? లేదా? అనే విషయాలను సైతం ఈ ఉద్యోగులు తెలుసుకోవాల్సి ఉంది.

పేరెంట్స్ కమిటీతో మాట్లాడటం ద్వారా ఉద్యోగులు విద్యార్థుల సమస్యలకు సంబంధించిన పరిష్కారం కోసం కృషి చేయాల్సి ఉంది. ఏ.ఎన్.ఎంలు పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందో లేదో చెక్ చేయాల్సి ఉంటుంది. పాఠశాలలలో నమోదయ్యే ఫిర్యాదులను సచివాలయ మహిళా పోలీస్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఈ అదనపు బాధ్యతలపై ఉద్యోగులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

సంవత్సరం సంవత్సరానికి జగన్ సర్కార్ భారం అంతకంతకూ పెంచుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ ఉద్యోగులపై ఒత్తిడి పెంచితే గ్రామ, వార్డ్ సచివాలయాల ఉద్యోగుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం అయితే ఉంది. ఈ అదనపు బాధ్యతల గురించి ఉద్యోగులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.