ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కొందరు సీనియర్ మంత్రులు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. అనుభవం ఉన్నా సరే సీఎం జగన్ కు సహాయ సహకారాలు అందించడం లేదు. ఆదాయ మార్గాలను పెంచే విషయంలో సీనియర్ మంత్రులు సలహాలు సూచనలు కూడా ఇవ్వటం లేదు. ఇక ముఖ్యమంత్రి జగన్ కూడా ఎక్కువగా సలహాదారులు మీద ఆధారపడటం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది అనే మాటలు ఎక్కువగా విన్పిస్తున్నాయి.
కొంత మంది సన్నిహితులను ముఖ్యమంత్రి జగన్ సలహాదారుగా నియమించుకున్నారు. వాళ్ళు ఇచ్చిన సలహాలు మినహా సీనియర్ నేతలు ఇచ్చే సలహాలను తీసుకునే పరిస్థితి లో ముఖ్యమంత్రి లేరు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వైసీపీ సర్కార్ ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వైసీపీ నేతలు కొంత మంది అవినీతి వ్యవహారాలు చేయటం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గడానికి కారణం అని కొంతమంది అంటున్నారు.
అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కు సీనియర్ మంత్రులు సహకరించకపోవడం వెనక ఇదే కారణం అయి ఉండవచ్చు అనే భావన కూడా ఉంది. ప్రధానంగా మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి సీఎం జగన్ కు సహాయం అందడం లేదని అంటున్నారు. కీలక శాఖ మంత్రిగా ఉన్నా సరే ఆయన నుంచి జగన్ కు సహకారం అందకపోవడంతో వైసీపీ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్యాబినెట్ సమావేశాల్లో కూడా బొత్స సత్యనారాయణ సైలెంట్ గా ఉంటున్నారని దీని కారణంగా ముఖ్యమంత్రి జగన్ కూడా ఆయనతో ఎక్కువగా మాట్లాడ లేకపోతున్నారు అని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా పనిచేస్తున్న సరే బొత్స సత్యనారాయణ మాత్రం తన శాఖ విషయంలో సీరియస్గా వ్యవహరించ లేకపోతున్నారు అని అంటున్నారు.