ఏపీలో కొత్త మద్యం బ్రాండ్లు.. మద్యపాన నిషేధం అంటే ఇదేనా జగన్?

YS Jagan compromise to reduce liquor rates

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలలో లేని మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఏపీలోని మద్యం తాగడం వల్లే కొంతమంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని మద్యం బ్రాండ్ల పేర్లు చిత్రవిచిత్రంగా ఉండటంతో పాటు జగన్ సర్కార్ పై ట్రోలింగ్ కు కారణమయ్యాయనే సంగతి తెలిసిందే.

2019 ఎన్నికల ముందు జగన్ సర్కార్ ఇచ్చిన హామీలలో మద్యపాన నిషేధం ఒకటి కాగా ఈ హామీని నిలబెట్టుకోవడంలో జగన్ సర్కార్ వేర్వేరు కారణాల వల్ల విఫలమైంది. అయితే మరోవైపు కొత్త మద్యం బ్రాండ్లకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ఈ బ్రాండ్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే అమలులో ఉన్న కొన్ని బ్రాండ్లకు స్వల్పంగా పేర్లు మార్చి కొత్త బ్రాండ్లను అమ్ముతున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు ఉన్నా ఆ విమర్శలను జగన్ సర్కార్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

మద్యం విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు మారాల్సి ఉంది. ప్రభుత్వం ఇష్టానుసరంగా ధరలు పెంచుకుంటూ వెళ్లడం, భారీ సంఖ్యలో బార్ అండ్ రెస్టారెంట్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పేదల్ని పీల్చి పిప్పి చేసే విధంగా జగన్ సర్కార్ నిర్ణయాలు ఉన్నాయని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.