అప్పులాంధ్రప్రదేశ్.. ఈ విషయంలో జగన్ పై మళ్లీ విమర్శలు తప్పవేమో?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం అప్పులతోనే రాష్ట్రాన్ని పాలిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం కరుణ ఉండటంతో జగన్ సర్కార్ కు ఇంతకాలం అప్పుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. అయితే రోజులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. వచ్చే నెలలో జీతాలు, పెన్షన్లు ఇవ్వాలన్నా కూడా జగన్ సర్కార్ కు కష్టమేనని తెలుస్తోంది. ఆర్బీఐ నుంచి అప్పుల కోసం జగన్ సర్కార్ తెగ ప్రయత్నిస్తోంది.

కేంద్రం నుంచి తీసుకోవాల్సిన అప్పులకు సంబంధించిన పరిమితి ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అప్పులాంధ్రప్రదేశ్ అంటూ జగన్ సర్కార్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన ఢిల్లీలో ఉన్నారు. రాష్ట్రానికి అప్పుల కోసం ఆయన తన వంతు ప్రయత్నం చేస్తున్నారని సమాచారం అందుతోంది.

జగన్ సర్కార్ అప్పుల పాలన వల్ల రాష్ట్రానికి ఏదో ఒకరోజు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కేంద్రం అప్పుల విషయంలో అమలు చేస్తున్న నిబంధనల వల్ల ఏపీ సర్కార్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సర్కార్ ఈ ఇబ్బందులను రాబోయే రోజుల్లో ఏ విధంగా అధిగమిస్తుందో చూడాల్సి ఉంది.

జగన్ సర్కార్ ఎన్ని పథకాలను అమలు చేసినా అప్పులతో కూడిన పరిపాలన వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పవచ్చు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కార్ వ్యవహరిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.