సంబరంలో లోకేష్: భార్యతో సెల్ఫీ ట్వీట్

పోలవరం స్పిల్ వే గ్యాలరీ వాక్ ఆదిలో చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ విజయవంతంగా ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు గ్యాలరీ వాక్ ను ప్రారంభించారు. తదుపరి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో కలిసి గ్యాలరీలో పాల్గొన్నారు.

ఈ గ్యాలరీ వాక్ లో మంత్రి నారా లోకేష్ నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆయన ఒక ట్వీట్ పెట్టారు. డ్యామ్ పని తీరులో ఉపయోగపడే స్పిల్ వే, పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలక నిర్మాణం పూర్తి అయింది. దీనిని పురస్కరించుకుంటూ జరిగిన స్పిల్ వే గ్యాలరీ వాక్ లో గౌరవ ముఖ్యమంత్రి మరియు కుటుంబ సభ్యులతో కలిసి నడిచాను. అని ట్వీట్ చేశారు.

Walked through the Gallery of Spillway along with Hon’ble CM and family members to celebrate the completion of one of the critical parts of the Spillway which will help monitor the dam’s functioning and operations. https://t.co/xUrkknjXXZ

— Lokesh Nara (@naralokesh) September 12, 2018

పోలవరం సందర్శనం అనంతరం నాయకులంతా పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించుకున్నారు. అక్కడ మంత్రి లోకేష్ తన భార్యతో కలిసి సెల్ఫీ దిగారు. ఇది ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన ఇలా రాసుకొచ్చారు. పట్టిసీమను సందర్శించడానికి మరో అవకాశం దక్కింది. ఈసారి నారా బ్రాహ్మణితో కలిసి అందమైన దృశ్యాన్ని సమృద్ధిగా ప్రవహిస్తున్న నీటిని సందర్శించాము. కింద వారు దిగిన సెల్ఫీ ఉంది చూడవచ్చు.

Got the chance to revisit Pattiseema, this time with @brahmaninara, and witness the beautiful sight and sound of water flowing in abundance. pic.twitter.com/ry8lG5vpqZ

— Lokesh Nara (@naralokesh) September 12, 2018