చేసిన పని బయటపడినందుకు నిజంగా తెలుగుదేశంపార్టీ సిగ్గుపడాలి. అయితే సిగ్గుపడాల్సిన టిడిపి వైసిపి మీద ఎదురుదాడి చేస్తోంది. 3.5 కోట్ల ఏపి ప్రజల వ్యక్తిగత వివరాలు ఐటి గ్రిడ్ సాఫ్ట్ వేర్ సంస్ధతో పాటు బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ దగ్గర దొరికినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి. రాబోయే ఎన్నికల్లో వైసిపిని ఓడగొట్టేందుకే చంద్రబాబునాయుడు పెద్ద ప్లాన్ వేశారు. అందుకే అనుమానం ఉన్న వైసిపి ఓట్లను ఓటర్లజాబితాలో నుండి తొలగిస్తున్నారు. ఆ విషయం తాజాగా బయటపడింది. అందుకనే ఆ స్కాంలో నుండి బయటపడేందుకు వైసిపిపై ఎదురుదాడి చేస్తోంది.
చంద్రబాబు, లోకేష్ బోండా ఉమ తదితరులు పెద్ద గొంతేసుకుని వైసిపిపై ఆరోపణలు చేస్తున్నారు. టిడిపికి చెందిన 8 లక్షల ఓట్లు గల్లంతు చేసేందుకు వైసిపి ప్రయత్నిస్తున్నట్లు ఎంఎల్ఏ బోండా చేసిన వ్యాఖ్యలు నిజంగానే సిగ్గు చేటు. లక్షల సంఖ్యలో ఓట్లను ప్రతిపక్షం ఏరేస్తోందంటే అధికార పార్టీ అంత చేతకానిదని అంగీకరిస్తున్నట్లేనా ? అధికార పార్టీ ఓట్లను ఏరేసేంత అవకాశం ప్రతిపక్షానికి ఎలా సాధ్యమవుతుంది ? అంతటి మెకానిజం టిడిపికి కాకుండా వైసిపికి ఎలా సాధ్యమైంది ?
చంద్రబాబు ట్రాక్ రికార్డు చూసినా ప్రత్యర్ధులను ఎదుర్కొనే విషయంలో ఇటువంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అసలు లక్షల సంఖ్యలోల సేవామిత్రలను నియమించటంలోనే చంద్రబాబు దురుద్దేశ్యం బయటపడుతోంది. లక్షల సంఖ్యలో వైసిపి సానుభూతిపరుల ఓట్లను తొలగొంచటమన్నది దాదాపు ఏడాదిన్నర క్రితమే మొదలైంది. చంద్రబాబు ఎందుకింత స్ధాయికి దిగజారి పోయారంటే రాబోయే ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేకే అన్నది స్పష్టమవతోంది. బయటపడిన స్కాంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తేనే తెరవెనుక సూత్రదారుల పాత్ర ఏమిటో పడుతుంది.
