పవన్ కు ఫ్యాన్స్ ఉంటే.. జగన్ కు సోల్జర్స్ ఉన్నారు!

ఏపీలో ఇప్పుడు పవన్ వర్సస్ వైసీపీ రాజకీయం నడుస్తోంది. వారాహి యాత్ర వేళ పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా వాలంటీర్ల వ్యవస్థపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాలంటీర్ల నుంచి ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

అయినా కూడా పవన్ సృహలోకి రాకుండా వాలంటీర్లపై అవాకులూ, చెవాకులూ పేలుతూనే ఉన్నారు. అందుకు ఏమాత్రం తగ్గకుండా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ.. వాయించి వదిలిపెడుతున్నారు. ఇదే సమయంలో ప్రజల్లోనూ పవన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే కామెంట్లు వెలువడుతున్నాయి.

ఈ సమయంలో టెన్షన్ పడిన టీడీపీ.. వాలంటీర్ల వ్యవస్థ పైన తమ వైఖరి స్పష్టం చేసింది. వాలంటీర్లను రద్దు చేయమని ఆ పార్టీ ప్రకటించింది. వారి పని తీరులో కావాల్సిన మార్పులు చేస్తామని స్పష్టం చేసింది. పవన్ వాలంటీర్ల వ్యవస్థను ప్రశ్నిస్తూ.. వ్యతిరేకంగా ఉన్న సమయంలో టీడీపీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఆసక్తిగా మారింది.

ఆ సంగతి అలా ఉంటే… మరోపక్క పవన్… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఈ సమయంలోనే మంత్రి రోజా.. తాజాగా పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ సినిమాల్లో చేసినట్లుగా రాజకీయాల్లో చేయటం కుదరదని మంత్రి రోజా తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

అవును… పవన్ పైన మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పవన్ సినిమాలో చేసినట్లుగా రాజకీయాల్లో చేస్తే ప్రజలు సహించరని మొదలుపెట్టిన రోజా.. మతి స్థిమితం లేని వ్యక్తిలా పవన్ ప్రవర్తిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఊగిపోతూ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

ఇదే సమయంలో తనకు తాను విప్లవకారుడిగా చెప్పుకొనే పవన్… ఏం విప్లవం చేసారని రోజా ప్రశ్నించారు. విప్లవకారులు ఎవరూ ప్యాకేజీ కోసం పని చేయరని రోజా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో… పవన్ కు ఫ్యాన్స్ ఉంటే, జగన్ కు సోల్జర్స్ ఉన్నారని రోజా స్పష్టం చేశారు!

ఈ సందర్భంగా 175 నియోజకవర్గాల్లో జనసేన తరుపున పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు కూడా లేరని ఎద్దేవా చేసిన రోజా… ఇది షూటింగ్ కాదు.. రియాల్టీ అని గుర్తించాలని సూచించారు.

కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో రూ 2.38 కోట్లతో నిరంఇంచిన ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన రోజా… “ఆడుదాం ఆంధ్రా” పేరుతో క్రీడలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఫైనల్ గా… వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా…. “జగన్ వన్స్ మోర్” అనటానికి సిద్దంగా ఉన్నారని రోజా పేర్కొన్నారు.