ఆంధ్రప్రదేశ్ మానవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం అధినేత మీద మండిపడుతున్నారు.
చంద్రబాబు నాయుడి పుత్ర వాత్సల్యం ఆయనను బాగా ఇబ్బందిపెడుతూ ఉంది. తను ఎంతో జాగ్రత్త అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న భిమిలీ నియోజకవర్గం మీద చంద్రబాబు కన్ను పడటం గంటాకు ఏమాత్రం నచ్చడం లేదు. భిమిలీ సీటు సురక్షితమయిందని, అది కుమారుడు, మొదటి సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నఐటి మంత్రి నారా లోకేష్ కు అది సేఫ్ అని చంద్రబాబు భావించడంతో గంట పరిస్థితి తారుమారయింది.
గంటా ప్రతిఎన్నికకు కొత్త నియోజకవర్గానికి మారుతుంటారు. 2014లో భీమిలీ నుంచి గెలుపొందిన గంటా ఈ సారి కూడ అక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. తన గెలుపు కోసం వీలుగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇపుడది ఆయనకు సేఫ్. దానిని కుప్పంలాగా, పులివెందుల లాగా గంటా వారి కోట లాగా తయారుచేసుకుంటున్నాడు. దానికి తోడు ఆయన బిజినెస్ ఇంటరెస్టులు కూడా అక్కడే ఉన్నాయి. అందువల్ల ఆయన ఈ నియోజకవర్గం పర్మనెంటు అనుకున్నాడు. రాజకీయాల్లో శాశ్వతాలుండవని చంద్రబాబు చెబుతున్నారు.
సేఫ్ జోన్ భిమిలీ నుంచి నారా లోకేష్ ను పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని తండ్రిగా చంద్రబాబుబాధ్యతాయుతంగా పరిశీలిస్తున్నారు. అదే గంటాకు నచ్చలేదు. అన్నింటికంటే ముఖ్యంగా, కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే కావడం , తర్వాతకోట్ల వెచ్చించి దానిని దారికితెచ్చుకున్న తనతోనే సంప్రదించకుండా ముఖ్యమంత్రి ఇలాంటి ఆలోచన చేయడం గంటాకు ఏమాత్రం నచ్చలేదు. ఇదే పాడుబుద్ధి అనుకుంటున్నారు.
సీట్ల పంపిణీలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇలా వ్యవహరించవచ్చాఅనేది ఆయన ప్రశ్న అని గంటా సన్నిహితులు చెబుతున్నారు. బాబు తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని వారు చెబుతున్నారు. సహచరుడు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు తొలుత భీమిలి టికెట్ ఆశించారు. టీడీపీ నాయకత్వం నిరాకరించింది. తాను భీమిలి నుంచే బరిలోకి దిగుతానని గంటా,భీమిలి వదులుకునేంది లేదని గంటా స్పష్టం చేశారు. గంటా ఇలా తెగేసి చెప్పడంతో ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వయంగా గంటా ఇంటికి వెళ్లి మరీ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ‘పార్టీ అదిష్టానం మాటగా చెబుతున్నా..నీకే భీమిలి సీటు’ అంటూ భరోసా ఇచ్చారని అంటున్నారు. ఆ మాటేదో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్ప వచ్చుగా అని గంటా అనుచరులు అడుగుతున్నారు.
తన కుమారుడు లోకేష్ ను పార్టీ అధినేత చంద్రబాబు తెరపైకి తీసుకు రావడం, ముందుగానే ఓ పథకం ప్రకారంమీడియాలో రాయించుకోవడం గంటా కు ఏమాత్రం నచ్చడంలేదు. గంటా అంటే మామూలు టిడిపి నేత కాద, బాగా డబ్బు దస్కం ఉన్నవాడు. ఎన్నికల నిధుల కోసం పార్టీ మీద ఆధారపడే బాపతు కాదు. అవసరమయితే, తాను ఒక డజను మంది ఎమ్మెల్యేలకు, అయిదారుగురు ఎంపిలకు కూడా ఖర్చుపెట్టగల శక్తివంతుడు. ఇంతబలమున్నా తనతో సంప్రదించకుడా అమరావతిలో జరిగిన సమన్వయ కమిటీ భేటీలో అధినేతచంద్రబాబు ఉన్నట్లుండి తన కొడుకు లోకేష్‌ను భీమిలి నుంచి బరిలోకిదింపుతున్నట్టుగా తెగేసి చెప్పడం గంటాకు మింగుడుపడటం లేదు. అంతేకాదు, గాజువాక, చోడవరంలలో ఏదో ఒకనియోజకవర్గాన్ని ఎంచు కోవాలని సూచించడంతో గంటా తీవ్రఅసంతృప్తి తీవ్ర స్థాయికి చేరుకుందని అంటున్నారు.
చంద్ర బాబు తనను మోసగించాడని, తన కుమారుడి కోసం తన సీటును త్యాగం చేయమంటున్నాడంటూ అసహనం వ్యక్తం చేసినట్లు, మిత్ర ద్రోహం లోలోన కుమిలిపోతున్నట్లు సమాచారం.
అయితే, గంటా కోసం మరొక ఆఫర్ చేసినట్లు సమాచారం. ఆయనకోసం విశాఖ నార్త్ ను కేటాయిస్తామని హామీ ఇచ్చారని పార్టీ వర్గాల్లో వినపడుతూ ఉంది.గంటా పార్టీ నుంచి ఉడాయిస్తాడా? వైసిపి మాత్రం ఆశగా ఇలాంటి వార్త కోసం ఎదురుచూస్తూ ఉంది.