భర్తతో కలిసి పొలంలో నాటేసిన  ఏపీ మంత్రి అఖిల ప్రియ (ఫోటోలు)

ఈ కొత్త జంటను గుర్తు పట్టారా.. ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియా భార్గవరామ్ నాయుడు దంపతులు.  కర్నూలు జిల్లాలోని రుద్రవరం గ్రామం నుంచి అఖిల ప్రియ తన భర్తతో కలిసి వెళ్తున్నారు. ఇంతలో పాములేటి అనే రైతు పొలంలో నాట్లు వేస్తూ కూలీలు కనిపించారు. అంతే వెంటనే అఖిల ప్రియ దంపతులు కారు దిగి వారి వద్దకు వచ్చి ముచ్చటించి మంచి, చెడ్డ తెలుసుకున్నారు. వారితో ముచ్చటిస్తూ వారితో కలిసి అఖిల ప్రియ వరినాట్లు వేశారు.

ఈ ఆసక్తికర సన్నివేశాన్ని అఖిల ప్రియ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ప్రజల మధ్య ఉన్నప్పుడు తనకు ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోగలిగానని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అఖిల ప్రియ తెలిపారు.