ప్రతిపక్ష పార్టీ,పత్రికల భరతం పట్టే పనిని మల్లేశ్వరస్వామి వారికి అప్పగించిన దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

mantri vellampalli prayed to god that the opposition party and fraud media would end

విజయవాడ :సాధారణంగా దేవుళ్లు, దేవతలను అందరూ తాము, కుటుంబం, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, మంత్రి వెల్లంపల్లి మాత్రం తమ ప్రత్యర్థులను దెబ్బతీయాలని అమ్మవారిని కోరారట! ఈ విషయాన్ని స్వయంగా మంత్రి వెల్లంపల్లి మీడియాకు చెప్పారు.

సోమవారం నాడు ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనుల శిలాఫలకాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే ప్రతిపక్ష పార్టీని, వ్యతిరేక పత్రికలు, ఛానల్స్ మూసేయాలని స్వామి వారిని వేడుకున్నానని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో దేవాలయాల్లో భవనాలను కూల్చేయడం, ఎఫ్‌డీలను ఇష్టానుసారంగా ఖర్చు చేశారన్నారు.

mantri vellampalli prayed to god that the opposition party and fraud media would end
minister vellampalli srinivas

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తున్నామని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధి చేస్తామంటే కూడా‌ అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు గతంలో స్వరూపానందేంద్ర స్వామి కాళ్ల కింద పడుకోలేదా అని ప్రశ్నించారు. హిందూ ధర్మం కాపాడే వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.