జెసి దివాకర్ రెడ్డికి పరాభవం… అయినా,పాపం

అనంతపురం లోక్ సభ సభ్యుడు జెసి దివాకర్ రెడ్డికి పరాభవం జరిగింది. అది కూడాఈ రోజు చంద్రబాబు సమక్షంలోనే. 

ఈ రోజు ఆయన  అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకుని తాడిపత్రి వివాదం గురించి వివరించారు. తాడి పత్రి సమీపంలో ఆశ్రమం కట్టుకుని ప్రబోధానంద అనే కమ్మ స్వామీజీ చేస్తున్న ఆగడాల గురించి వివరించారు. అంతేకాదు, వాటికి సాక్ష్యంగా ఆయన తాను సేకరించిన వీడియోలను కూడా చంద్రబాబుకు అందచేశారు.  ప్రబోధానంద స్వామి, ఆయన ఆశ్రమ వాసులు చేస్తున్న పలునేరాల ఘోరాల వివరాల వీడియోాలలో ఉన్నాయి. అయితే, చంద్ర బాబు నుంచి ఆశించిన స్పందన రాలేదని తెలిసింది. పార్టీకి చెందిన ఎంపి, రాష్ట్రంలో నే సీనియర్ మోస్టు పొలిటిషయన్ , శాసన సభ్యుడు అయిన వ్యక్తి  ఫిర్యాదు చేస్తే రావలసినంత స్పందన రాలేదు. అయన దిగాలుగా బయటకు వచ్చారు . అంతేకాదు, తనకంటే ప్రబోధానంద స్వామీ బలవంతుడని అంగీకరించారు. తాడిపత్రి సంస్థానాధీశుడికి ఎపరిస్థితి వచ్చిందోచూడండి. తన నియోజకవర్గంలో తనకంటే బలవంతుడున్నాడని ఆయన పబ్లీక్ గా ఒప్పుకోవలసి వచ్చింది. ముఖ్యమంత్రి తో మాట్లాడి బయటకు వచ్చాక జెసి దివాకర్ రెడ్డి చెప్పిన నాలుగు ముక్కలు, మారుతున్న తాడిపత్రి రాజకీయ  సమీకరణాన్ని సూచన ప్రాయంగా వెల్లడిస్తాయి. తాడిపత్రి మీద జెసి పట్టు తప్పిపోతున్నట్లేనా… రాజకీయ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఒక స్వామీజీ ద్వారా అమలుచేస్తున్నారా? దివాకర్ రెడ్డి ఏమన్నారంటే..

  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెప్పాల్సిదంతా చెప్పాను.
  • ఆయన ఏ విషయాన్నైనా అంత  తొందరగా తేల్చి చెప్పే మనిషా , కాదు.
  • స్వామి ప్రబోధానంద ఆశ్రమ కార్యకలాపాల మీద వీడియో క్లిప్పింగులు చంద్రబాబుకు ఇచ్చాను..
  • తర్వాత చూసుకుంటానని ముఖ్యమంత్రి చెప్పారు.
  • అనంతలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో చెప్పాల్సింది నేను కాదు.. చినరాజప్ప.
  • ప్రబోధానంద బలవంతుడు కాబట్టే నాపై దాడి చేశాడు.

అయినా పాపం, జెసి దివాకర్ రెడ్డి ఇపుడున్న పరిస్థితుల్లో టిడిపి వదిలే సాహపం చేయలేరు. చేసి ఎటుపోవాలి? పెద్ద ప్రశ్న ఇది

(జెసి మీడియాతో మాట్లాడిన వివరాలు మరికొద్దిసేపట్లో….)