ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో అవినీతి లేకుండా పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ అమలు చేస్తున్న పథకాల విషయంలో ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. జగన్ అవినీతి చేసినట్లు ఒక్క ఆధారం కూడా లేదు. అయితే లోకేశ్ మాత్రం జగన్ కేవలం ఇసుక ద్వారా 3 కోట్ల రూపాయల అవినీతి చేస్తున్నాడని కామెంట్లు చేశారు. రోజుకు 3 కోట్ల రేంజ్ లో ఆదాయం లభిస్తోందని లోకేశ్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం తిరుపతిలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ జగన్ గురించి ఈ కామెంట్లు చేశారు. తిరుపతిలోని భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడుతూ జగన్ గురించి లోకేశ్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం. జగన్ సర్కార్ ఇసుక విధానాన్ని భ్రష్టు పట్టించిందని లోకేశ్ చెప్పుకొచ్చారు. భవన నిర్మాణ కార్మికులను జగన్ సర్కార్ ఇబ్బంది పెడుతోందని భవన నిర్మాణ కార్మికులను జగన్ పొట్టన పెట్టుకున్నారని అన్నారు.
జగన్ సర్కార్ కార్మికుల ఆరోగ్య బీమాను పట్టించుకోవడం లేదని జగన్ సర్కార్ పాలనలో ఇసుక దొరకడం లేదని లోకేశ్ చెప్పుకొచ్చారు. జగన్ ఇసుక దందా చేస్తూ ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన కామెంట్లు చెయడం గమనార్హం. ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలుగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. జగన్ హయాంలో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయని లోకేశ్ తెలిపారు.
తెలుగుదేశం అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని లోకేశ్ కామెంట్లు చేయడం గమనార్హం. సెస్ నిధులను సైతం జగన్ సర్కార్ పక్కదారి పట్టించిందని లోకేశ్ కామెంట్లు చేయడం గమనార్హం. లోకేశ్ చేసిన కామెంట్ల గురించి జగన్ సర్కార్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.