ఏపీపై కేసీఆర్ ఆశలు వదిలేసుకుంటే బెటర్.. వృథా ప్రయాసే అంటూ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఆంధప్రదేశ్ విడిపోవడంలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడిపోవడం వల్ల తెలంగాణకు లాభం కలుగుతుందని కేసీఆర్ ఆలోచించారే తప్ప ఏపీ ఏ స్థాయిలో నష్టపోతుందనే విషయాన్ని మాత్రం కేసీఆర్ అంచనా వేయలేకపోయారు. ప్రస్తుతం బీ.ఆర్.ఎస్ పార్టీ ద్వారా ఏపీలో సత్తా చాటాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

ఏపీలోని పలు ప్రాంతాలలో బీ.ఆర్.ఎస్ పార్టీకి సంబంధించిన పోస్టర్లు వెలిశాయి. అయితే ఏపీపై కేసీఆర్ ఆశలు వదిలేసుకుంటే బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రజలలో పైకి కనిపించకపోయినా కేసీఆర్ పై ఉన్న ఆగ్రహం అంతాఇంతా కాదు. కేసీఆర్ పార్టీ ఎక్కడ పోటీ చేసినా అక్కడ డిపాజిట్లు కూడా దక్కే అవకాశం అయితే లేవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఇతర రాష్ట్రాలపై బీ.ఆర్.ఎస్ దృష్టి పెట్టినా తప్పు లేదని ఏపీపై మాత్రం దృష్టి పెట్టకపోతే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో కేసీఆర్ పార్టీ పోటీ చేసి దారుణంగా ఓడిపోతే ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కేసీఆర్ అన్ని విషయాలను గుర్తుంచుకుని ఏపీలో పోటీ విషయంలో పునరాలోచించుకుంటే మంచిదని చెప్పవచ్చు.

ఇతర రాష్ట్రాలలో మాత్రం మంచి పేరు ఉన్న పార్టీలతో కలిసి పని చేస్తే బీ.ఆర్.ఎస్ పార్టీకి కచ్చితంగా బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. బీ.ఆర్.ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల అదే సమయంలో కొన్ని పార్టీలకు ఈ పార్టీ టార్గెట్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. కేసీఆర్ ప్రతి అడుగును జాగ్రత్తగా వేయాలని ఒక్క తప్పటడుగు వేసినా ఆ ఫలితం ఊహించని స్థాయిలో ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.