కంచి అత్తి వరదరాజ స్వామి దర్శనానికి కేసీఆర్

కంచి అత్తి వరదరాజ స్వామి దర్శనానికి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఈరోజు కంచి వెళ్లి అత్తి వరదరాజ స్వామి వారిని కుటుంబంతో దర్శించుకోబోతున్నారు . కేసీఆర్ సోమవారం ఉదయం 9. 00 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ విమాన్రాయం నుంచి తిరుపతి బయలుదేరుతారు . 10. 00 గంటలకు చిత్తూర్ కలెక్టర్, వై .సి .పి నాయకులు చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ స్వాగతం పలుకుతారు . తరువాత చంద్ర శేఖర్ రావు కుటుంబ సభ్యుల ను రోజా తన నివాసానికి ఆహ్వానించి అల్పాహారం ఏర్పాటు చేస్తుంది . ఇందుకు సంబందించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది.

అక్కడ నుంచి చంద్ర శేఖర్ రావు రోడ్ మార్గంలో కంచికి వెడతారు . ఈ దేవాలయంలో కొలువైన అత్తి వరదరాజ స్వామి వారిని దర్శించుకుంటారు . ఆలయ కోనేటి నుంచి 40 సంవత్సరాలకు ఒకసారి 48 రోజులు మాత్రమే దర్శనం ఇచ్చే వరదరాజ స్వామి వారు ఈనెల 17 వరకు మాత్రమే దర్శనం ఇస్తారు . అందుకే స్వామి వారిని చంద్ర శేఖర్ రావు కుటుంబ సభ్యులతో వెళ్లి దర్శనం చేసుకోబోతున్నారు . అనంతరం మళ్ళీ రోడ్ మార్గాన తిరుపతి చేరుకొని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు .