కమ్మ నాయకుడయిన చంద్రబాబు నాయుడిని విపరీతంగా పొగిడి, ఆయన సంతృప్తి కోసం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టాను సారం మాట్లాడినందుకు రెడ్లు ఆయనను అనుమానంగా చూస్తారు. కులద్రోహిగా భావిస్తారు.
పెద్ద రెడ్డి అని పేరున్నా ఇంత చక్కగా కమ్మవారి పార్టీలో ఒదిగి పోయి, చంద్రబాబుకు తమకంటే బాగా భజన చేస్తాడని,ఇందులో ఏదో మతలబు ఉందని ఆయనను కమ్మవాళ్లు కూడ అనుమానంగా చూస్తారు.
ఏవరేమనుకున్నా తన పంథా మార్చుకోడాయన. తను చెప్పాల్సింది చెబుతాడు. చేయాల్సింది చేస్తాడు. తెలుగుదేశం పార్టీ కమ్మ వాసన వేస్తున్నదని అని కూడా అంటాడు. ఇపుడు కూడా ఆయన ఇదే అభిప్రాయంతో ఉన్నట్లుంది. అదే ఆయన మార్కు రాజకీయం.
ఇంతకీ పెద్ద రెడ్డి ఎవరో తెలుసుగా… అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్ది.
ఆయన ఏమ్మాట్లాగినా వైరలవుతుంది. ఏమ్మాడితే, మీడియా హైలైట్ చేస్తుందో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఎపుడూ ఏదో ఒకటి మాట్లాడి సంచలనం సృష్టిస్తూ ఉంటారు.
ఎక్కువ సార్లు తన కులం మీద చురలేస్తుంటారు. జగన్ రంగం మీదికి వచ్చాక అది మరీ ఎక్కువయింది. రాష్ట్రంలోనే సీనియర్ పొలిటిషన్ అయినా, రాజశేఖర్ రెడ్డి పోయాక రెడ్ల నాయకత్వం నిజానికి దివాకర్ రెడ్డిక రావాలి.దాన్ని జగన్ తన్నుకు పోయాడు.దీనితో ఆయనకు ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. రెడ్లు ఆయను సీరియస్ గా తీసుకోవడం మానేశారు. ఆ ఆవేదన ఆయన లో కనిపిస్తుంది.
స్వయంగా రెడ్డి ఆయినా ఆయన కమ్మలతో సఖ్యత కోరుకుంటున్నారు. అది ముఖ్యమంత్రి చంద్రబాబు కు బాగా నచ్చింది.అందుకే ఆయనకు కొంతమేరకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కనబడుతుంది. ఆయన కుమారుడు పవన్ కు అనంతపురం లోక్ సభ టికెట్ ఇచ్చారు. జెసి తమ్ముడి కుమారుడు అస్మిత్ కు అసెంబ్లీ టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.
ఆయన ఈ రోజు ఏమన్నారో చూడండి.
పోలింగ్ సందర్భంగా మధ్యాహ్నం నుంచి హింసాత్మక సంఘటనలు పెరిగాయని దీని వెనక వైసిపి వాళ్లున్నారని ఆయన అన్నారు. దీనికి కారణం, అధికారంలోకి వస్తే, తమ మీద బుక్ చేసిన కేసులను జగన్ ఎత్తివేస్తాడనే ధీమాయే అని వ్యాఖ్యానించి దివాకర్ రెడ్డి మరొక సారి సంచలన వార్త అయ్యారు.
పరోక్షంగా చంద్రబాబు విధానాల వల్ల రాష్ట్రంలో రెండు పెద్ద కులాలు ( రెడ్లు,కమ్మలు ) మధ్య పోలరైజేషన్ జరిగిందని ఇది మంచిదికాదని కూడా ధైర్యంగా చెప్పారు.
‘రెడ్లలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలన్న పట్టుదల కనిపించింది.అందుకే రెడ్లందరూ ఈ సారి ఎన్నికల్లో చావోరేవో అన్నట్టు పోరాడారు. అయితే, మహిళలు ఆ కోరికని నెరవేరనీయకపోవచ్చు. స్త్రీమూర్తుల దెబ్బతో రెడ్ల కోరిక నెరవేరడం లేద,’ ని దివాకర్‌రెడ్డి చెప్పారు.
దివాకర్ రెడ్డి గత ఎన్నికల్లో అనంతపురం నుంచి లోక్ సభకు ఎంపికయ్యారు. ఇపుడాయన కుమారుడికి తావిచ్చి తాను ఎన్నికల రాజకీయాలనుంచి తప్పుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన ఒక సలహా కూడా ఇచ్చారు. దాదాపు చంద్రబాబు నాయుడు గెలిచినట్లు ఆయన ఈ సలహా ఇవ్వడం విశేషం. ఆయన సీరియస్ గా సలహా ఇచ్చారా లేక నవ్వుతూ ఇలా చెప్పారా తెలియదుగాని చంద్రబాబు కూడ తనలాగే కొడుక్కి పట్టా భిషేకం చేయాలని అన్నారు.
‘వచ్చే ఐదేళ్లలో లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసే విషయం చంద్రబాబు ఆలోచించాలి. అయితే, లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలంటే అన్ని సామాజికవర్గాలను ఆయన దగ్గరకు తీసుకోవాలని,’ అని పరోక్షంగా కమ్మలమీదే మమకారం చూపడం మంచికాదన్నట్లు చెప్పారు.
ఇపుడు రాష్ట్రంలో జరిగిన కమ్మ, రెడ్డి పోలరైజేషన్ గురించి చెబుతూ కమ్మలు ఓ వైపు.. రెడ్లు మరో వైపు అనే సామాజిక ధోరణి రాజకీయాల్లో మంచిదికాదని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్ అధికారంలోకి వస్తే కేసులు తీసేస్తాడనే నమ్మకం వైసీపీ శ్రేణుల్లో దాడులకు పాల్పడ్డాయని, ఈ రోజు ఉదయానికి గాని వాళ్లకు జరగబోయేదేమిటో తెలియలేదని అన్నారు.
చంద్రబాబును స్త్రీమూర్తులు, వృద్ధులే గెలిపిస్తున్నారని ఆయన దివాక ర్ రెడ్డి చెప్పారు.
‘క్యూలైన్లలో మహిళలను చూశాక టీడీపీ గెలుపు ఖాయయింది. వెళ్లిపోయిన మహిళలు పోలింగ్‌కు తిరిగిరావడం నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు,’ ఎన్నికల రాజకీయాల్లో లేకపోయినా క్రియాశీలకంగా ఉంటానని దివాకర్‌రెడ్డి చెప్పారు.
