AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా ఆసక్తికరంగానే ఉంటాయి. ప్రస్తుతం కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇలా కూటమి ఏర్పడిన తర్వాత సీఎం పదవి గురించి కూడా ఎన్నో చర్చలు జరిగాయి. పొత్తులో భాగంగా జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు పోటీ చేసి గెలిచాయి అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే త్వరలోనే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది మంత్రులు, నేతలు మాట్లాడటంతో జనసైనికులు ఆగ్రహించి పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు.
ఇలా ఈ వివాదం భారీ స్థాయిలో చర్చలకు కారణం కావడంతో అధిష్టానం స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు తన పదవి నుంచి తప్పుకుంటారని పరోక్షంగా జేసి దివాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి స్థానం తన కొడుకు లోకేష్ కి దక్కుతుంది అనే విధంగానే మాట్లాడారు.
చంద్రబాబు తర్వాత ఆ కుర్చీలో కూర్చోవడానికి లోకేష్ అర్హుడని తెలియజేశారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న లోకేష్ భవిష్యత్‌లో తెలుగుదేశం పార్టీని నడిపించే వ్యక్తిగా ఎదుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటంలో జేసీ పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడలేదు పవన్ కళ్యాణ్ గారి గురించి నాకు ఎలాంటి విషయాలు తెలియదు తెలియనప్పుడు నేనేం మాట్లాడుతాను అంటూ తెలియచేశారు.
ఇక చంద్రబాబు నాయుడు తర్వలోనే నారా లోకేష్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించి ఈయన జాతీయస్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెడతారని జెసి దివాకర్ రెడ్డి తెలిపారు. అయితే, ఇదే సమయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలా జెసి దివాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి రాష్ట్ర రాజకీయాలలో చర్చలకు కారణమవుతున్నాయి.
