కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ యువ నాయకుడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పర్యటించిన బైరెడ్డి.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిల పార్టీ మార్పులు – తాడిపత్రిలో వారు చేస్తున్న పనులు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బ. అవును… జేసీ బ్రదర్స్ ఇద్దరూ వైసీపీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని మొదలుపెట్టిన బైరెడ్డి… జేసీ బ్రదర్సే కాదు వారి పిల్లలను కూడా వైసీపీలోకి పంపించాలని చూస్తున్నారని సంచనల వ్యాఖ్యలు చేశారు. కానీ… వారిని మాత్రం పార్టీలో చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు బైరెడ్డి!
ఈ సందర్భంగా జేసీ బ్రదర్స్ పై తీవ్ర విమర్శలు చేసిన బైరెడ్డి… తాడిపత్రి ప్రజలు జేసీ కుటుంబం నుంచి కాపాడే వాడే లేడా అని చూస్తున్నసమయంలో.. ప్రజలకు పెద్దారెడ్డి రూపంలో స్వేచ్చ లభించిందని చెబుతున్న సిద్దార్థ రెడ్డి… వైసీపీ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాకే తాడిపత్రిలో దౌర్జన్యాలు ఆగాయని కితాబునిచ్చారు.
జేసీ బ్రదర్స్ విషయంలో ఇదే ఫ్లో కంటిన్యూ చేసిన బైరెడ్డి… బస్సులు అక్రమంగా నడిపి సామాన్యుల ప్రాణాలు తీసిన వారికి తమ పార్టీలో చోటులేదని స్పష్టం చేశారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచే తొలి సీటు తాడిపత్రి అని చెప్పుకొచ్చారు బైరెడ్డి. దానికి మరో కారణం… అనంతపురం జిల్లాలోని టీడీపీ నేతలే.. తాము గెలిచినా గెలవకపోయినా జేసీ బ్రదర్స్ మాత్రం గెలవకూడదని కోరుకుంటున్నారని బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు!
ఈ సందర్భంగా చంద్రబాబుపైనా విమర్శలు చేసిన బైరెడ్డి… చంద్రబాబును కుప్పం ప్రజలు 40 ఏల్లుగా గెలిపిస్తూ వస్తుంటే.. ఏనాడూ అక్కడి ప్రజలను పట్టించుకోలేదని.. కానీ జగన్ దెబ్బతో ఇప్పుడు నెలకోసారి కుప్పం పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.