జగన్ ‘కాపు యు టర్న్’ దెబ్బ , జనసేనకు జంప్ చేస్తున్న వైసిపి నేత

కాపు రిజర్వేషన్ పాలసీ మీద జగన్ తీసుకున్న యు టర్న్ వైసిపి మీద దుష్ప్రభావం చూపిస్తుంది. కాపు రిజర్వేషన్లు సాధ్యంకాని పని ఆయన ప్రకటించిన మరుక్షణం, అత్యంత జనాదరణ ఉన్న కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసిపి అధినేత జగన్మోన్ రెడ్డికి దూరమయ్యారు. అయితే, తూర్పుగోదావరి జిల్లా నుంచే కాపు వ్యతిరేక యుటర్న్ తీసుకోవడం కాపులను కలచి వేస్తూ ఉంది. అందుకే మొదటి ఎదురు దెబ్బలు ఆజిల్లానుంచే మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్‌ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారు. ఆయన సన్నిహితులు చెబుతున్నదాని ప్రకారం, కాపు రిజర్వేషన్ల మీద స్పష్టమయిన వైఖరితో ఉన్న జనసేన లోకి ఆయన జంప్ అవుతున్నారు  


కాపు రిజర్వేషన్ల మీద, జనసేన నేత పవన్ కల్యాణ్ వ్యక్తి గత జీవితం మీద జగన్ చేసిన వ్యాఖ్యల వల్లే ఆయన ఇక వైసిపిలో ఉండరాదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

జగన్ వ్యాఖ్యల చాలా మంది కాపుల్లో వైసిపి పట్ల విముఖత కల్పించాయి.

ఇంతకాలం కాపు రిజర్వేషన్లను సమర్థించడం, ముద్రగడ పద్మానాభానికి పూర్తి మద్దతు ప్రకటించడం, తీరా ఎన్నికలు సమీపిస్తున్నపుడు ‘అబ్బే కాపు రిజర్వేషన్లు అసలు సాధ్యం కాదు, అవి కేంద్రం చేతిలో వ్యవహారం,’అని చాలా మంది కాపులకు నచ్చడం లేదు. ముఖ్యంగా జనసేనే నేత దీనిని రాజకీయంగా బాగా వాడుకుంటున్నారు.

ఆయన కాపు రిజర్వేషన్లకు ఎపుడే మద్దతు ప్రకటించకుండా, కాపు రిజర్వేషన్లకు తాను వ్యతిరేకి కాదని సందేశం పంపగిలిగారు. వస్తాయో రావో గాని, కాపు రిజర్వేసన్లను రాజ్యాంగం 9వ షెడ్యూల్ లో చేర్చాలన్న ప్రకటన కాపులకు బాగా నచ్చింది.దీనితో చాలా మంది కాపు నేతలు వైసిపి వదిలేసి జనసేనలో చేరారు.
ఇప్పుడు దుర్గేశ్‌ వైసిపి వదిలేస్తున్నట్లు ప్రచారం మొదలయింది. దుర్గేష్ జిల్లాలో బాగా పేరున్ననాయకుడు. మొదట ఆయన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

2016 ఆయన కాంగ్రెస్ వదలి వైసిపిలో చేరారు. అదివైసిపికి బాగా వూపు నిచ్చింది. 2019 ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని అనుకున్నారు. అయితే, ఇంతలోనే జగన్ యుట ర్న్ వల్ల ఆయన పార్టీవదిలేసి వెళ్లాలనుకుంటున్నట్లు, ఈ విషయాన్ని సన్నిహితులతో చర్చించినట్లు కూడా సమాచారం అందింది. ఇయన ఇపుడు ఆయన వైసీపీ గ్రేటర్‌ రాజమహేంద్రవరం కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే, జగన్ నుంచి ఆయనకు ఎలాంటి హమీ రాలేదు. అయినా పార్టీలోనే ఉంటూ పనిచేస్తూ వస్తున్నారు. అయితే, జగన్ ప్రకటన బెడిసికొడుతుందనే ఆందోళన ఇక వైసిపిలో కొనసాగడం మంచిదికాదని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఈ వూహాగానాల మీదస్వయంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.