Mudragada:కాపు ఉద్యమ నేతగా ఒకానొక సమయంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ కాపు సామాజిక వర్గం కోసం పాటుపడిన ముద్రగడ పద్మనాభం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. ఈయన 2024 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలోకి వెళ్తారని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా వైసీపీ పార్టీలోకి వెళ్లారు దీంతో కాపు సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా తన కుమార్తె క్రాంతి స్వయంగా తన తండ్రికి వ్యతిరేకంగా మారెటమే కాకుండా జనసేన పార్టీలోకి చేరారు.
ఇక ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ను ఓడించడమే తన లక్ష్యం అంటూ సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్ ఓటమిపాలు కాకపోతే తాను ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా మారుతాను అంటూ చాలెంజ్ విస్తారు. అయితే పవన్ కళ్యాణ్ గెలవడం వైసీపీ ఓడిపోవడం జరిగింది ఇక ముద్రగడ కూడా ఇచ్చిన మాట ప్రకారం తన పేరులో రెడ్డి జోడించుకున్నారు. ఇటీవల రాజకీయాల పరంగా ముద్రగడ తిరిగి యాక్టివ్ అయ్యారు.
ఇదిలా ఉండగా తాజాగా ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి తన తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.. నాన్న క్యాన్సర్ తో బాధపడుతున్నారని తెలిసింది. అయితే నాన్నను కలవడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నప్పటికీ తన సోదరుడు గిరి తనని అడ్డుకుంటున్నారని తన మామయ్యతో కలిసి నన్ను నాన్నను చూడటానికి రానివ్వటం లేదని తెలిపారు. నాన్న క్యాన్సర్ తో బాధపడుతుంటే కనీసం తనకు చికిత్స కూడా చేయించకుండా ఒక గదిలో బంధించి పెట్టారంటూ ఈమె ఆందోళన చెందారు.
గిరి, అతని బంధువుల ముద్రగడను బంధించి, ఒంటరిగా ఉంచుతున్నారని తెలిసిందని.. ఎవరూ ముద్రగడను సంప్రదించడానికి, మాట్లాడటానికి అనుమతించడం లేదని ఆరోపించారు. ఇది దారుణమని.. ఎంత మాత్రం సహించే విషయం కాదని క్రాంతి స్పష్టం చేశారు. రాజకీయ కారణాల కోసం ఇలా చేస్తున్నట్లయితే వదిలిపెట్టననని సోదరుడు గిరికి ముద్రగ కుమార్తె క్రాంతి హెచ్చరించారు. ఇలా ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ బారిన పడ్డారని విషయం తెలియడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.