ఏపీలో జగన్ సర్కార్ సంక్షేమ పథకాలతో దూసుకెళ్తోంది. నవరత్నాలతో పాటూ ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 2021–22కు కూడా నవరత్నాల్లోని సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు ఏ నెలల్లో అందించేది ముందుగానే తెలియచేస్తూ సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించారు. ముందుగానే నెలలవారీగా ప్రకటించారు.2021–22లో ఏ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఏ నెలలో అందించేది కేబినెట్ సమావేశంలో ఖరారు చేశారు. సామాజిక పెన్షన్లను రూ.2500 పెంచనున్నట్లు తెలిపారు.
కొత్తగా వచ్చే ఆర్ధిక ఏడాది అగ్రవర్ణాల్లోని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు పేద మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఇలా ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తారో షెడ్యూల్ ఉంది. ఏప్రిల్ నెల నుంచి వివరాలని చూస్తే …
ఏప్రిల్
* జగనన్న వసతి దీవెన 1వ విడత
* జగనన్న విద్యా దీవెన 1వ విడత
* పొదుపు సంఘాల మహిళలకు
* వైఎస్సార్ సున్నా వడ్డీ చెల్లింపులు
* రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ(2019 రబీ)
మే
* మత్స్యకార భరోసా (వేట నిషేధ సబ్సిడీ)
* మత్స్యకార భరోసా (డీజిల్ సబ్సిడీ)
* రైతులకు వైఎస్సార్
* ఉచిత పంటల బీమా(2020 ఖరీఫ్ )
* వైఎస్సార్ రైతు భరోసా 1వ విడత
జూన్
* వైఎస్సార్ చేయూత
* జగనన్న విద్యా కానుక
జూలై
* జగనన్న విద్యా దీవెన 2వ విడత
* వైఎస్సార్ కాపు నేస్తం
* వైఎస్సార్ వాహన మిత్ర
ఆగస్టు
* రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ చెల్లింపులు(2020 ఖరీఫ్)
* ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక రాయితీలు
* వైఎస్సార్ నేతన్న నేస్తం
* అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు
సెప్టెంబర్
* వైఎస్సార్ ఆసరా
అక్టోబర్
* వైఎస్సార్ రైతు భరోసా 2వ విడత
* జగనన్న చేదోడు (టైలర్లు, నాయి బ్రాహ్మణులు, రజకులు)
* జగనన్న తోడు (చిరువ్యాపారులు)
నవంబర్
* వైఎస్సార్ ఈబీసీ నేస్తం
డిసెంబర్
* జగనన్న వసతి దీవెన 2వ విడత
* జగనన్న విద్యా దీవెన 3వ విడత
* వైఎస్‌ఆర్ లా నేస్తం
జనవరి 2022
* వైఎస్సార్ రైతు భరోసా 3వ విడత
* జగనన్న అమ్మ ఒడి
* పెన్షన్ పెంపు నెలకు రూ.2500
ఫిబ్రవరి 2022
* జగనన్న విద్యా దీవెన 4వ విడత
ఈ పథకాలతో పాటూ వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరు ముద్ద, రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, పెన్షన్ కానుకలు కూడా అమలవుతున్నాయి.