ఏపీ సీఎం వైఎస్ జగన్ వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే వరకు ఎలాంటి రిస్క్ ను తీసుకోవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఉపఎన్నికలకు వెళ్లడం వల్ల పార్టీకి లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణాల వల్లే కొంతమంది నేతల విషయంలో కోపం ఉన్నా జగన్ సర్కార్ మాత్రం పంతాలకు పోవడం లేదని తెలుస్తోంది. ఉపఎన్నికలో ఓటమిపాలైతే పోయేది పార్టీ పరువేననే సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికలు కేసీఆర్ ను ఏ స్థాయిలో టెన్షన్ పెట్టాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. జగన్ కోరుకుంటే ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నా ఆయన మాత్రం ఉపఎన్నికలను కోరుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పార్టీపై విమర్శలు చేసేవాళ్లపై చర్యలు తీసుకోవడానికి సైతం జగన్ ఏ మాత్రం ఇష్టపడటం లేదనే సంగతి తెలిసిందే.
ఉపఎన్నికల్లో గెలిస్తే వైసీపీకే మేలు జరుగుతుంది. అయితే ఉపఎన్నికల కోసం అన్ని పార్టీలు 1000 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్థాయిలో ఖర్చు చేయడం కూడా వైసీపీకి సులువు కాదు. ఏపీలో రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అభివృద్ధి దిశగా జగన్ అడుగులు వేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందని కామెంట్లు చేసున్నారు.
వైసీపీకి ప్రస్తుతం సగం మంది పాజిటివ్ గా ఉంటే సగం మంది నెగిటివ్ గా ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంటే మొదటికే మోసం వస్తుందని జగన్ భావన అని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ ఎన్నికల విషయంలో ఎలాంటి ప్లానింగ్ తో ముందుకెళ్లనుందో చూడాల్సి ఉంది. జగన్ సర్కార్ కు 2024 ఎన్నికలు కీలకం కానున్నాయి.