ఒక రాష్ట్రానికి సీఎం అయిన వ్యక్తికి కచ్చితంగా అంతోఇంతో పొలిటికల్ గా అనుభవం ఉండాలి. అదే సమయంలో ప్రజల నుంచి విమర్శలు రాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అవగాహన ఉండాలి. అయితే జగన్ సర్కార్ మాత్రం ఈ అవగాహన లేకపోవడం వల్ల ప్రస్తుతం ఇబ్బందులు పడుతుండటం గమనార్హం. జగన్ సర్కార్ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న కొన్ని నిర్ణయాలు ప్రజల నుంచి విమర్శలకు కారణమవుతున్నాయి.
తాజాగా జగన్ సర్కార్ లాటరీ టికెట్ల వల్ల ప్రజల నుంచి విమర్శలను మూటగట్టుకుంటోంది. తాజాగా విజయనగరంలో రవాణాశాఖ అధికారులు మూడు బైక్ లను లక్కీ డ్రాకు పెట్టారు. ఒక్కో బైక్ విలువ లక్ష రూపాయలు కాగా మూడు బైక్ ల విలువ ఏకంగా మూడు లక్షల రూపాయలు కావడంతో చాలామంది ఈ టికెట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. అయితే కొంతమంది మాత్రం ఈ లాటరీ టికెట్ల విషయంలో విమర్శలు చేశారు.
వైసీపీ మంత్రి ఒకరు ఈ లాటరీ టికెట్ల వెనుక ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే తనపై విమర్శలు రావడంతో ఆ మంత్రి వెంటనే అధికారులతో తనకు ఆ లాటరీ టికెట్లకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇప్పించారు. అయితే ఈ లాటరీ టికెట్ల వెనుక ఏపీ ప్రభుత్వం ఉందని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రవాణాశాఖ అధికారులు ఈ విధంగా చేశారని తెలుస్తోంది.
ఆదాయం పెంచుకోవడం కోసం జగన్ సర్కార్ చేస్తున్న పనులు చెత్తగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు విమర్శలు చేసే అవకాశాన్ని జగన్ సర్కార్ స్వయంగా కల్పిస్తుండటం గమనార్హం. జగన్ సర్కార్ ఈ విమర్శల విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేయడం ఆపినా పరవాలేదని ఇలాంటి తప్పులు మాత్రం చేయొద్దని విశ్లేషకులు సూచిస్తున్నారు.