ముందస్తు ఊసే ఎత్తని జగన్, కేసీఆర్.. అలా జరిగే ఛాన్స్ ఉందని భయమా?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికలంటూ కొంతకాలం క్రితం వరకు జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అటు కేసీఆర్ కానీ ఇటు జగన్ కానీ ముందస్తు ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ముందస్తు ఎన్నికలకు వెళితే అనుకూలంగా ఫలితాలు వచ్చే ఛాన్స్ ఏ స్థాయిలో ఉందో రాకపోయే ఛాన్స్ కూడా అదే స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది. ఈ రీజన్ వల్లే జగన్, కేసీఆర్ ముందస్తు ఊసే ఎత్తడం లేదు.

వాస్తవానికి తెలంగాణలో టీ.ఆర్.ఎస్, ఏపీలో వైసీపీ మరోసారి అధికారంలోకి రావడానికి అనుకూల పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రత్యర్థి పార్టీలను తక్కువగా అంచనా వెయ్యడానికి వీలు లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉండగా ఏపీలో టీడీపీకి సైతం ఒకింత అనుకూల పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే ఈ పార్టీలకు అధికారం వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

అయితే మరోవైపు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తుంటే జగన్ మాత్రం వైసీపీని 175కు 175 స్థానాలలో గెలిపించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. ఈ ఇద్దరిలో ఎవరి ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో, ఎవరి స్ట్రాటజీలు వర్కౌట్ అవుతాయో చూడాల్సి ఉంది. జగన్, కేసీఆర్ భిన్నమైన దారులలో ముందుకెళుతూ ఉండటంతో రాజకీయ విశ్లేషకులు సైతం ఎవరి పరిస్థితి ఏంటో చెప్పలేకపోతున్నారు.

అదే సమయంలో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి పెట్టడం ఈ సమయంలో కరెక్ట్ కాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని మరో పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం తేలిక కాదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ అనవసరంగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి సమయం వృథా చేసుకుంటున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.