ఒక్కరు కాదు ఇద్దరు.. జగన్ ఫార్ములాతో పార్టీకి ఇబ్బందులు తప్పవా?

YS Jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు 2024లో ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని ఉంది. వైసీపీ అధికారంలో లేకపోతే ఎదురయ్యే ఇబ్బందులు జగన్ కు తెలియనిది కాదు. అదే సమయంలో 2024 ఎన్నికలకు సంబంధించి రిస్క్ తీసుకోవడానికి జగన్ అస్సలు సిద్ధంగా లేరు. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ గెలవడానికి తన వంతుగా ఎన్ని చేయాలో జగన్ అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వైసీపీ ప్రజలకు దగ్గరయ్యే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేసిన సంగతి తెలిసిందే.

జగన్ సర్కార్ ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో సర్వేలను నిర్వహిస్తూ ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎమ్మెల్యేలకు సూచనలు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ తాజాగా ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించడానికి సిద్ధమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఇంఛార్జ్ లను నియమించింది.

అయితే జగన్ సర్కార్ ఇంఛార్జ్ లతో పాటు పరిశీలకులను నియమించడంపై కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని సమాచారం అందుతోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరు కాని వైసీపీ నేతలకు ఇప్పటికే జగన్ సర్కార్ నుంచి వార్నింగ్ లు అందుతున్నాయని సమాచారం అందుతోంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే వైసీపీ రాజకీయ నేతలనే పరిశీలకులుగా నియమించనుందని తెలుస్తోంది.

అయితే జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి ప్లస్ అవుతుందో లేక మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది. వైసీపీ సర్కార్ ప్రస్తుతం గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఆ పార్టీ కొన్ని నిర్ణయాల విషయంలో మాత్రం మారాల్సి ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.