లక్ష మంది రక్తదానం.. జగన్ పై అభిమానానికి ఇంతకు మించిన సాక్ష్యముందా?

ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. కొంతమంది రాజకీయ నేతలకు జగన్ పుట్టినరోజు ప్రత్యేకం కాకపోయినా జగన్ ను అభిమానించే వాళ్లకు మాత్రం ఈరోజు ఎంతో ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో 95 శాతం హామీలను నెరవేర్చిన సీఎం జగన్ మిగిలిన హామీలను సైతం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆర్థికంగా పరిస్థితులు బాలేకపోయినా ప్రజలు ఇబ్బంది పడకుండా జగన్ వ్యవహరిస్తున్నారు.

వీలైనంత వరకు అప్పులపై ఆధారపడకుండా పాలన సాగించడానికి జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. అర్హులకు సంక్షేమ పథకాల అమలు విషయంలో అస్సలు రాజీ పడకూడదని జగన్ భావిస్తుండటం గమనార్హం. జగన్ భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటుండగా ఆయన ముందుచూపుకు సాధారణ ప్రజలు సైతం ఫిదా అవుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు జగన్ ఎంతగానో దగ్గరయ్యారు.

జగన్ సర్కార్ నుంచి సహాయం పొందిన ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీకి ఓటేస్తామని చెబుతున్నారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా లక్ష మంది రక్తదానానికి సిద్ధమయ్యారంటే వాళ్లకు జగన్ పై ఏ స్థాయిలో అభిమానం ఉందో సులువుగానే క్లారిటీ వస్తుంది. ప్రజల కోసం జగన్ స్థాయిలో ఆలోచిస్తున్న రాజకీయ నేత ఇతర రాష్ట్రాల్లో కూడా లేరని మరి కొందరు చెబుతున్నారు.

జగన్ 50వ పుట్టినరోజును వైసీపీ నేతలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఏపీ అభివృద్ధికి జగన్ లాంటి రాజకీయ నేతలు ఎంతో అవసరమని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ పుట్టినరోజుకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజల మనస్సులను గెలుచుకున్న వైఎస్ జగన్ 2024 ఎన్నికల్లో 2019 ఎన్నికలను మించిన ఫలితాలను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.