చంద్రబాబుకు ఐటీ నోటీసులు… అభ్యంతరాల తిరస్కరణ!

ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై చంద్రబాబు అభ్యంతారలు తెలిపినా… ఐటీ శాఖ వాటిని తిరస్కరించడంతో వ్యవహారం సీరియస్ గా మారింది!

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల రూపంలో రూ.118 కోట్ల ముడుపులు అందుకున్నారనేది అభియోగం. ఈ క్రమంలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ కు ముడుపులు డెలివరీ చేసినట్లు షాపూర్జి పల్లోంజి మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో… విషయం కన్ ఫాం చేసుకున్న ఐటీ శాఖ తాజా నోటీసుల్లో.. ఇన్‌ ఫ్రా కంపెనీల ద్వారా అందుకున్న రూ.118 కోట్లను బ్లాక్ మనీగా ఎందుకు పరిగణించరాదో తెలపాలని బాబును ఐటీ శాఖ కోరింది.

ఇటీవల ఐటీ శాఖ అధికారులు షాపూర్జి పల్లోంజి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల చేపట్టగా.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది. అమరావతి కాంట్రాక్టర్ లు అయిన షాపూర్జి పల్లోంజి (ఎస్.పి.సి.ఎల్), ఎల్ & టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు 118 కోట్ల ముడుపులు అందాయనేది ఆరోపణగా జాతీయ పత్రిక తన కధనంలో పేర్కొంది.

ఈ కథనం ప్రకారం… 2016లో చంద్రబాబు పిఏ శ్రీనివాస్ తో టచ్‌ లో ఉంటూ వచ్చిన పార్థసారథి.. అతని ద్వారానే సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి ముడుపుల్ని చంద్రబాబు కు అందించారట. దీన్ని బలపరుస్తూ… 2016లో ఆగష్టులో చంద్రబాబు నాయుడు సెక్రటరీ శ్రీనివాస్‌ తనను కలిసి.. పార్టీకి ఫండ్‌ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు ఎంవీపీ ఐటీకి స్టేట్‌ మెంట్‌ ఇచ్చారని సమాచారం.

ఏది ఏమైనా… ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వ్యవహారం చంద్రబాబుకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు.