జనసేనలోకి వంగవీటి ?

కాపు నేత,  టిడిపి నేత, వంగవీటి రంగా కొడుకు వంగవీటి రాధాకృష్ణ జనసేనలోకి చేరుతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికలకు ముందే టిడిపిలో చేరిన రాధా తాజాగా పవన్ కల్యాణ్ తో భేటీ అవటంతో అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.

నిజానికి రాధా ఏ పార్టీలో ఉన్న పెద్ద ఉపయోగం లేదు.  ఎన్నికలకు ముందు వరకూ వైసిపిలో ఉన్నా వైసిపి యువజన అధ్యక్ష పదవికి న్యాయం చేసిందే లేదు. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోకవర్గంలో టికెట్ ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి చెప్పటంతో అలిగిన రాధా టిడిపిలోకి మారిపోయాడు.

టిడిపిలో మారాడే కానీ చంద్రబాబు కూడా టికెట్ ఇవ్వలేదు. అందుకనే ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యాడు. సరే మొన్నటి ఎన్నికల్లో టిడిపికి జనాలు మాడు పగులగొట్టారు కదా ? దాంతో ఏం చేయాలో అర్ధంకాక ఇంటినుండి బయటకే రావటంలేదు. అయితే ఇంత కాలానికి హటాత్తుగా జనసేన కార్యాలయంకు వెళ్ళి పవన్ తో అర్ధగంట భేటీ అవటంతోనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.

నిజానికి ఎన్నికలకు ముందే జనసేనలో చేరుతారని ప్రచారం జరిగినా రాధా ఎందకనో టిడిపి వైపే మొగ్గుచూపారు.  ఇపుడు రాధా టిడిపిలో ఉన్నా జనసేనలో ఉన్నా పెద్ద తేడా ఏమీ లేదు. పార్టీల సంగతి అటుంచితే అసలు రాధాదే కష్టపడే తత్వంకాదు. ఎంతసేపు తండ్రి ఇమేజిని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటున్నారా కాబట్టే రాధాను జనాలు పట్టించుకోవటం లేదు.