వాస్తవానికి దగ్గరగా… ఏపీ ఎన్నికలపై ఇంట్రస్టింగ్ సర్వే!

ఈ సారి ఏపీలో ఎన్నికలు అత్యంత చారిత్రాత్మక ఎన్నికలుగా నిలుస్తాయని అంటున్నారు పరిశీలకులు. సాధారణంగా ఎన్నికలు అంటే… ఒక పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. మిగిలిన పార్టీలు ఓడిపోయి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటాయి. అయితే… ఈసారి అంతకుమించి అని అంటున్నారు పరిశీలకులు. ఈదఫా ఓడిపోయిన పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

కారణం… ఇప్పుడు జరుగుతున్నవి ఎన్నికలు అని జనం అనుకుంటున్నారేమో కానీ.. యుద్ధమే అని పార్టీలు అనుకుంటున్నాయని అంటున్నారు. దీంతో… ఈ సమయంలో అభ్యర్థుల ఎంపికపై జగన్ కసరత్తులు చేస్తున్నారు. సీట్ల సర్ధుబాట్లు, అభ్యర్థుల ఎంపిక, కూటముల కూర్పు వంటి విషయాల్లో చంద్రబాబు బిజీగా ఉన్నారని తెలుస్తుంది.

ఇక పవన్ కల్యాణ్ కూడా… తమకు వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించుకోవాలనే ప్రయత్నాల్లో మునిగిపోయారని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా ఒక సర్వే తెరపైకి వచ్చింది. మూడ్ ఆఫ్ ఏపీ సర్వేను పాపులర్ ప్రీ పోల్ సర్వే పేరిట ఒక సంస్థ వెలుగులోనికి తెచ్చింది. ఈ సర్వే ఫలితాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి.

ప్రస్తుతానికి ఈ ఫలితాలు లోక్ సభ సీట్లకు సంబంధించినవే అయినప్పటికీ… వీటి ఆధారంగా అసెంబ్లీ సీట్లపై ఒక అంచనాకు రావొచ్చు. కారణం… ఒక ఎంపీ సీటుకి సరాసరిని 7 అసెంబ్లీ సీట్లను పరిగణలోకి తీసుకోవచ్చు. ఏపీలో మొత్తం 25 ఎంపీస్థానాలు ఉన్నాయి. అయితే 25 * 7 = 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

ఈ ఫలితాల ప్రకారం ఏపీలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పది ఎంపీ సీట్లు వస్తాయని ఆ సర్వే చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా… విజయనగరం, అరకు, అమలాపురం, ఏలూరు, విజయవాడ, రాజంపేట, కడప, చిత్తురు, తిరుపతి, నంద్యాలలలో వైసీపీ ఎంపీ సీట్లు కచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉందని ఆ సర్వే పేర్కొంది.

ఇక టీడీపీ జనసేన కూటమికి తొమ్మిది సీట్లు వస్తాయని తెల్చింది. ఇందులో భాగంగా… శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, నర్సాపురం, నరసారావుపేట, బాపట్ల, కర్నూలు, హిందూపుర్… ఈ తొమ్మిది లోక్ సభ స్థానాల్లోనూ టీడీపీ కచ్చితంగా గెలిచే అవ్కాశాలున్నాయని సర్వే తేల్చింది.

అదే టైం లో హోరా హోరీ పోరుగా ఉన్న ఆరు సీట్లు… రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, అనంతపూరం, నెల్లూరు, ఒంగోలు గా ఉన్నాయి. ఈ ఆరు నియోజకవర్గాల్లోనూ టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేసింది. ఇప్పుడు ఈ లోక్ సభ స్థానాలను అసెంబ్లీలుగా కన్వర్ట్ చేసి చూసుకుంటే… ఈ హోరా హోరీ స్థానాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి.

అవును… ప్రతీ ఎంపీ సీటు పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయని చూసుకుంటే… వైసీపీకి 10 ఎంపీ సీట్లు కాబట్టి… ఆ లెక్కన, 70 అసెంబ్లీ సీట్లు.. టీడీపీ – జనసేన కూటమికి 9 ఎంపీ సీట్లు కాబట్టి… 63 అసెంబ్లీ సీట్లు రావచ్చు అని ఈ సర్వే ప్రకారం తెలుస్తోంది. ఇక మిగిలిన ఆరు సీట్లలో హోరా హోరీ పోరు ఉందని అంటే 48 అసెంబ్లీ సీట్లు అన్న మాట. అందుకే ఈ సర్వే ఆసక్తికరంగా ఉందని అంటున్నారు.

కారణం… ఈ సర్వే ఫలితాల ప్రకారం ఎవరికీ కన్ ఫాం గా మ్యాజిక్ ఫిగర్ వస్తుందని చెప్పలేని పరిస్థితి. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 88 అసెంబ్లీ సీట్లు రావాలి. ఆ లెక్కన హోరా హోరీ పోరని చెప్పే 48 స్థానాల్లోనూ వైసీపీకి ఇంకా 18 సీట్లు అవసరం పడుతుండగా… టీడీపీ – జనసేన కాంబోకు పాతిక సీట్లు అవసరం పడతాయి.

దీంతో ఈ సర్వే వాస్తవానికి కాస్త దగ్గరగానే ఉందని అంటున్నారు. కారణం… ఏపీలో వైసీపీ, టీడీపీ – జనసేనల మధ్య హోరా హోరీ పోరే సాగుతోందని.. దాన్నే ఈ సర్వే ప్రతిబింబించిందని చెబుతున్నారు. అయితే ఈ సర్వే “ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే” అంటోంది కాబట్టి… ఇంకా అభ్యర్ధులు డిసైడ్ అయి నోటిఫికేషన్ వచ్చాక నామినేషన్లు వేశాక సీన్ కాస్త మారే అవకాశం ఉంది! వెయిట్ & సీ!!