జనసేనతో బీజేపీ పొత్తు వెనుక అసలు కథ ఇదే.. పవన్ అందుకు అంగీకరిస్తారా?

Janasena shock to Rapaka Varaprasad 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉందా లేదా అనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు సమాధానాలుగా వినిపిస్తున్నాయి. కొంతమంది ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందని చెబుతుంటే మరి కొందరు మాత్రం ఈ పార్టీల మధ్య పొత్తు లేదని చెబుతున్నారు. బీజేపీ 2024 ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని చెబుతుండటం గమనార్హం. అయితే జనసేనతో పొత్తులో ఉంటే అలా పోటీ చేయడం ఎలా సాధ్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన అభిమానులు డిమాండ్ చేస్తున్నా బీజేపీలో చలనం కూడా లేదనే సంగతి తెలిసిందే. జనసేన విలీనం కోసమే బీజేపీ పొత్తు పెట్టుకుందని జనసేనను నిర్వీర్యం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జనసేనను బీజేపీలో విలీనం చేయాలని ప్రతిపాదన పెడితే పవన్ కళ్యాణ్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి బయటకు వస్తే బాగుంటుందని మరి కొందరు సూచనలు చేస్తున్నారు. ఈ కామెంట్లపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కు గతంలోనే ఈ తరహా ప్రపోజల్ వచ్చిందని అయితే పవన్ మాత్రం తాను పార్టీని విలీనం చేసే అవకాశం లేదని వెల్లడించిన సంగతి తెలిసిందే. బీజేపీ జనసేన కలిసి పోటీ చేసినా పెద్దగా బెనిఫిట్ ఉండదు.

ఏపీలో బీజేపీ పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. బీజేపీతో పోల్చి చూస్తే జనసేన పరిస్థితి అంతోఇంతో బెటరని కామెంట్లు వినిపిస్తున్నాయి. జనసేన విషయంలో పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకే పూర్తిస్థాయిలో పరిమితమైతే మంచి ఫలితాలు సాధించడం సాధ్యమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.