టీడీపీకి ఇలాంటి పరిస్థితా.. ట్విట్టర్ హ్యాక్ చేసింది ఆ పార్టీ వాళ్లేనా?

2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి టీడీపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా ప్రజలకు చేరువ కావాలని టీడీపీ భావిస్తుండగా తాజాగా టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ అఫీషియల్‌ ట్విట్టర్‌ అకౌంట్ హ్యాకింగ్ కు గురి కావడం గమనార్హం. హ్యాక్ చేసిన వాళ్లు ఇందులో విజువల్ ఆర్ట్స్ కు చెందిన పోస్ట్ లను పోస్ట్ చేస్తున్నారు. టీడీపీ డిజిటల్ వింగ్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది.

టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆ సమయంలో టీడీపీ ఐటీ విభాగం అప్రమత్తం కావడంతో ఎలాంటి నష్టం జరగలేదు. అయితే టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేసింది వైసీపీ మద్దతుదారులే అని ఆరోపణలు చేయడం గమనార్హం. ట్విట్టర్ హ్యాక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోలేక ఇప్పుడు టీడీపీ ఈ తరహా ఆరోపణలు చేయడంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ పేరును హ్యాకర్లు టైలర్ హాబ్స్ గా .మార్చడం గమనార్హం. టీడీపీ ట్విట్టర్ అకౌంట్ మళ్లీ తిరిగొస్తుందో లేదో చూడాల్సి ఉంది. వైసీపీకి మాత్రం ఈ తరహా సమస్యలు ఎప్పుడూ రాలేదు. టీడీపీ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా ప్రచారం చేస్తుండటంతో ఆ పార్టీని దెబ్బ తీయాలని ఈ విధంగా చేసి ఉండవచ్చని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలనే నిర్ణయానికి టీడీపీ కట్టుబడి ఉండటం ఆ పార్టీకి 2024 ఎన్నికల్లో ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది. అమరావతిని రాజధానిగా కొనసాగించడం వల్ల ఏపీ ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువగా కలిగే అవకాశం అయితే ఉంటుంది. టీడీపీ వచ్చే ఎన్నికల్లో 100కు పైగా అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించాలని భావిస్తోంది.