తెలంగాణలో ఎన్నికలు ముగిసాయి. మరికొన్ని గంటలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఈ సమయంలో ఫాం హౌస్ లో కేసీఆర్ ఏమి చేస్తున్నారు.. ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారు.. ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా లేక సైడ్ ఆలోచనలు ఏమైనా చేస్తారా అనే చర్చ మొదలైంది. ఆ సంగైతి అలా ఉంటే… తెలంగాణలో బీఆరెస్స్ తాజా పరిస్థితికి కేసీఆర్ తీసుకున్న ఒక్క నిర్ణయం కీలక కారణం అని చెప్పవచ్చు! అయితే ఏపీలో జగన్ ఆ నిర్ణయాన్నే వ్యతిరేకిస్తూ అడుగులు వేయడం గమనార్హం.
తెలంగాణలో బీఆరెస్స్ ది ఘోర పరాజయమా, కాంగ్రెస్ ది ఘనవిజయమా అంటే అవును అని చెప్పలేని పరిస్థితి! కాంగ్రెస్ ది విజయం.. బీఆరెస్స్ ది పరాజయం అని మాత్రమే చెప్పే పరిస్థితి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే… బీఆరెస్స్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి సిట్టింగులకు బ్లైండ్ గా టిక్కెట్లు ఇవ్వడమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఈ విషయంలో కేసీఆర్ మరీ అతి విశ్వాసం గానో… లేక, కాంగ్రెస్ ను లైట్ తీసుకోవడమో కానీ… మెజార్టీ సీట్లు సిట్టింగులకే ఇచ్చారు. పైగా పార్టీ ఆఫీసులో బహిరంగంగా మాట్లాడుతూ… తమ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని.. దళితబంధు డబ్బుల్లో కమిషన్లు అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆ లిస్ట్ తనవద్ద ఉందని చెప్పుకొచ్చారు! అన్నీ తెలిసిన కేసీఆర్… మళ్లీ వారికే సీట్లు ఎలా కట్టబెట్టారనేది ఆసక్తికరమైన అంశం.
తన సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవినీతి చేసినా, అక్రమాలకు పాల్పడినా, ప్రజలతో తత్సంబంధాలు లేకుండా ఉంటున్నా, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నా… కేసీఆర్ కు నచ్చొచ్చు, లేక, వారిపై సానుభూతో, ప్రేమో, గౌరవమో, ఇంకా నమ్మకమో ఉండొచ్చు… కానీ ప్రజలకు ఎందుకు ఉంటుంది? అనే చిన్న లాజిక్ కేసీఆర్ మిస్సాయ్యారని అంటున్నారు పరిశీలకులు. ఇది కాస్త అతి ఆలోచన అనేది వారి అభిప్రాయంగా ఉంది!
దీంతో… ఇది జగన్ కు గుడ్ న్యూస్ అని చెబుతున్నారు పరిశీలకులు. కారణం… ఎన్నికలకు సుమారు ఏడాది ముందు నుంచే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… తన ఎమ్మెల్యేలకు హెచ్చరికలు పంపుతూనే ఉన్నారు. ప్రజలతో మమేకం కానీ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీచేస్తూనే ఉన్నారు. తప్పించాల్సి వస్తే తప్పదనే విషయం గ్రహించాలని.. తప్పించినా వారంతా తనవారే అని చెబుతున్నారు.
అయితే కేసీఆర్ మాత్రం ఈ విషయంలో ఒంటెద్దు పోకడలకు పోయారనే అభిప్రాయం వెల్లడవుతోంది. ఇందులో భాగంగా ప్రధానంగా పలువురు సీనియర్లు అడ్డుచెప్పినా, కేటీఆర్ సైతం అసంతృప్తిని ప్రకటించినా కూడా కేసీఆర్… ఆల్ మోస్ట్ సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వడమే ఈ ముసలానికి అసలు కారణం అని అంటున్నారు. దీంతో… జగన్ తీసుకుంటున్న నిర్ణయానికి కార్యకర్తల నుంచి పూర్తి మద్దతు లభించనుందని చెబుతున్నారు.