రేషన్ డీలర్లకు ఏపీ సర్కార్ సంక్రాంతి కానుకను ప్రకటించింది. రేషన్ డీలర్లకు సరుకుల పై కమిషన్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సరుకుల పంపిణీ కమిషన్ 75 పైసల నుంచి రూపాయికి పెంచారు. దీంతో చక్కెర, బియ్యం, రాగులు, జొన్నలు, కందిపప్పు కమిషన్ ఒక రూపాయికి చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 29 వేల మంది రేషన్ డీలర్లకు లబ్ధి చేకూరనుంది.
దీని పై మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
“ఏపీ రేషన్ డీలర్లకు సంక్రాంతి కానుకగా కమిషన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. దీనిని వెంటనే అమలు చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేశాం. ప్రభుత్వ నిర్ణయంతో 29 వేల మంది డీలర్లకు లబ్ధి చేకూరనుంది. గత ఏడాది చంద్రన్న కానుకల కమిషన్ ను రూ. 5 నుంచి 10కి పెంచాం. టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు 25 పైసలు ఉన్న కమిషన్ ని పలు దఫాలుగా పెంచి ప్రస్తుతం రూపాయి చేశాం. ప్రభుత్వం అందరి మేలు కోరి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.” అని ఆయన అన్నారు.