రాజధాని కష్టాలన్ని ఆ మాజీ మంత్రినే చుట్టుకున్నాయి! పార్టీ మారడంతో పెరిగిన కష్టాలు

ఏపీలో ప్రతి రాజకీయ నాయకుడిని ఏదో విధంగా రాజధాని అంశం ఇబ్బందులకు గురి చేస్తుంది. రాజధాని అనే అంశం ఇప్పటికే వైసీపీ నేతలను తీవ్రంగా దెబ్బతీసింది. అమరావతిని రాజధానిగా టీడీపీ అధినేత నియమించినప్పుడు భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. అలాగే రాష్ట్రంలో చాలామంది కూడా రాజధాని అంశం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రాజధాని అనే అంశం మాత్రం ఒక మాజీ మంత్రిని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆ మాజీ మంత్రి ఎవరంటే డొక్కా మణిక్యవరప్రసాద్. ఆయన గతంలో కాంగ్రెస్ నుండి టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చారు.

చంద్రబాబు వల్లే టీడీపీని వదిలేశాడా!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో క‌లిసి డొక్కా మాణిక్యవ‌ర‌ప్రసాద్‌ రెండు మూడు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అయితే శాస‌న మండ‌లిని ర‌ద్దు చేస్తూ జ‌గ‌న్ నిర్ణయం తీసుకోవ‌డం, త‌న ఓట‌మికి గల్లా జ‌య‌దేవ్ కార‌ణ‌మ‌ని బాబుకు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న కార‌ణాలు సాకుగా చూపి ఆయ‌న కొద్ది రోజులుగా గ‌రం గ‌రం లాడారు. టీడీపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మార‌డంతో పార్టీ మారిపోయి డొక్కా మాణిక్యవ‌ర‌ప్రసాద్‌ వైఎస్సార్ సీపీలోకిచేరిపోయారు. నెల రోజుల కింద‌ట మ‌ళ్లీ అదే మండ‌లికి ఎంపిక‌య్యారు. వైఎస్సార్‌సీపీలో ఎంతో మంది సీనియ‌ర్లు ఉన్నా కూడా డొక్కాకే ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీ వ‌ర్గాల‌నే ఆశ్చర్యచ‌కితుల‌ను
చేశారు.

పార్టీ మారిన తరువాత పెరిగిన కష్టాలు

టీడీపీలో ఉన్నప్పుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ అమరావతిని రాజధానిగా చేయడానికి పూర్తి మద్దతు తెలిపారు. దాని కోసం చంద్రబాబు నాయుడుతో చాలా కృషి చేశారు. రాజధాని ఉన్న తాడికొండ నియోజక వర్గం నుండి రెండుసార్లు గెలిచాడు. దీంతో అమరావతిని రాజధానిగా నియమించడం డొక్కా మైలేజ్ పెంచడానికి చాలా ఉపయోగపడింది. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొని రావడంతో మాణిక్యవర ప్రసాద్ కు ఏమి చేయాలో అర్ధం కావడం లేదు. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడాలని వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంటే, వ్యతిరేకంగా మాట్లాడితే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలాగే టీడీపీ నేతల నుండి కూడా డోకా మాణిక్యవర ప్రసాద్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలా వైసీపీ నేతల నుండి, అమరావతి రైతుల నుండి, టీడీపీ నేతలను నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజధాని కష్టాలు అన్ని డొక్కా చుట్టూనే తిరుగుటున్నాయి.