జగన్ కు చిరాకు తెప్పిస్తున్న బొత్స సత్యనారాయణ… సీరియస్ గా ఉన్న సీఎం !

Cm jagan serious on Botsa satyanarayana

ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పుడు సొంత నేతలు సహాయ సహకారాలు అందించకపోవడంతో కొన్ని విషయాలలో ఆయన బాగానే ఇబ్బందులు పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమందికి కీలక నేతలు కూడా పెద్దగా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదని దీంతో ముఖ్యమంత్రి జగన్ లో ఆగ్రహం పెరిగిపోతుందని చెప్పాలి. ప్రధానంగా రాయలసీమ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, కొంతమంది సీనియర్ నేతలు కూడా ముఖ్యమంత్రి జగన్ కు సహకారం అందించడం లేదు. ఇక ముఖ్యమంత్రి జగన్ ఎక్కడికైనా పర్యటనకు వెళుతున్న సరే కొంతమంది నేతలు నుంచి సహకారం రావడం లేదు.

Cm jagan serious on Botsa satyanarayana
Cm jagan serious on Botsa satyanarayana

దీంతో త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ కొంతమంది మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కొంతమంది నేతలు విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఇప్పటివరకు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారని భావన ముఖ్యమంత్రి జగన్ లో ఉంది. అలాగే కొంతమంది మంత్రులు కూడా తన మాట లెక్క చేయడం లేదని ముఖ్యమంత్రి సీరియస్ గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ విషయంలో కూడా ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా వ్యవహరిస్తారని సమాచారం. త్వరలోనే ఆయనతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని బొత్స సత్యనారాయణ జగన్ కు సహకారం అందించడం లేదు అని అంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కార్యకర్తలకు ధైర్యం చెప్పే విషయంలో సొంత జిల్లాలోనే విఫలమయ్యారని కూడా అంటున్నారు. తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లాలో మంచి ప్రభావం చూపించడం ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కు మింగుడుపడటం లేదు అని చెప్పాలి. అందుకే బొత్స సత్యనారాయణ విషయంలో కాస్త సీరియస్ గా ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి అంటే కొంత కాలం ఆగాల్సిందే.