ఆ విషయంలో జగన్ తీరు మారాల్సిందేనా.. వాటిపై జగన్ దృష్టి పెడతారా?

2024 ఎన్నికలకు చాలా సమయం చాలా సమయం ఉన్నా ఇప్పటికే సర్వేలు మొదలయ్యాయి. 2024 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఇప్పటికే స్పష్టత వచ్చింది. వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని అయితే గతంలోలా 151 సీట్లలో గెలుపు మాత్రం అసాధ్యమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా ఆ వ్యతిరేకతను ఓట్ల రూపంలో మార్చుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం జగన్ తనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించాల్సి ఉంది. వైసీపీ బలంగా లేని నియోజకవర్గాల్లో గెలుపు దిశగా జగన్ అడుగులు వేయాల్సి ఉంది. తనపై వ్యక్తమవుతున్న విమర్శల విషయంలో దృష్టి పెట్టి ప్రజలకు జగన్ మరింత మెరుగైన పాలన అందించాల్సి ఉంది. ఈ విషయాలకు సంబంధించి జగన్ తీరు కచ్చితంగా మారితే మాత్రం వైసీపీకి రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని చెప్పవచ్చు.

ప్రజలకు మంచి సంక్షేమ పథకాలను అందించడంతో పాటు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడం, ఉపాధి కల్పన కల్పించడం, ప్రభుత్వ ఉద్యోగులలో వ్యతిరేకత లేకుండా జాగ్రత్త పడటం వైసీపీకి ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ వల్ల ఏ మాత్రం ప్రజాదరణ లేని నేతలు సైతం అధికారంలోకి రావడం సాధ్యమైందనే సంగతి తెలిసిందే.

రాజధాని అభివృద్ధి దిశగా జగన్ అడుగులు వేసి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు చెక్ పెడితే మాత్రం ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. జగన్ సర్కార్ రాజకీయ విశ్లేషకుల సలహాలు తీసుకుని ముందడుగులు వేయాల్సి ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.