ముందస్తు ఎన్నికల దిశగా జగన్ అడుగులు.. జగన్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వరుస షాకుల నేపథ్యంలో సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా వైసీపీకి అనుకూల ఫలితాలు వస్తాయని ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. జగన్ ఢిల్లీకి తరచూ వెళ్లడం వెనుక అసలు కారణం కూడా ఇదేనని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

జగన్ నిర్ణయానికి కేంద్రం సైతం అనుకూలంగా ఉందని తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా జగన్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదనే సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో జగన్ మోదీని సైతం కలవనున్నారని బోగట్టా. ఆలస్యం చేయడం వల్ల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని జగన్ భావిస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

జగన్ ముందస్తు ఆలోచనకు వైసీపీ నేతలు సైతం సపోర్ట్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ ఇప్పటికే కసరత్తును మొదలుపెట్టారని త్వరలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది. పోలవరం నిధుల విషయంలో కూడా కేంద్రం నుంచి జగన్ సర్కార్ కు అనుకూలంగా రెస్పాన్స్ వచ్చిందని సమాచారం అందుతోంది.

టీడీపీ, జనసేనలకు ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఇవ్వకూడదని సీఎం జగన్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. టీడీపీ, జనసేన కలవని పక్షంలో వైసీపీదే అధికారం అని జగన్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.