మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ లాజిక్ కరెక్టే.. కానీ?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న చాలా ప్రశ్నలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. సీఎం ఎక్కడినుంచి పాలన సాగిస్తారో ఇతరులు ఎలా చెప్పగలరని జగన్ అడిగారు. విశాఖ నుంచి రాబోయే రోజుల్లో పాలన సాగిస్తానని జగన్ చెప్పకనే చెప్పేశారు. విశాఖను రాజధానిని చేస్తే 5 నుంచి 10 వేల కోట్లలో రాజధాని పూర్తవుతుందని జగన్ కామెంట్లు చేశారు.

అమరావతి అటు గుంటూరుకు ఇటు విజయవాడకు చెరో 40కిలోమీటర్ల దూరంలో ఉందని అమరావతిని అభివృద్ధి చేసినా ప్రయోజనం ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో మూడు రాజధానుల దిశగా జగన్ అడుగులు వేస్తుండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గితే ప్రజల్లో చులకన అవుతామని జగన్ భావిస్తున్నారు.

మూడు రాజధానుల విషయంలో జగన్ లాజిక్ కరెక్టే అని సామాన్య ప్రజల నుంచి సైతం కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కోర్టుల నుంచి ఎదురుదెబ్బలు తగలకుండా జగన్ మూడు రాజధానులను ఏ విధంగా అమలు చేస్తారో చూడాలి. రాజధాని విషయంలో ప్రజల్లో సైతం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. విశాఖను రాజధాని చేయడం వల్ల ప్రయోజనం ఏంటని రాయలసీమ ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని జగన్ చెప్పిన లాజిక్ విషయంలో ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. జగన్ ను 2024 ఎన్నికల్లో ఓడించడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తుండటం గమనార్హం. 2024 ఎన్నికల సమయానికి టీడీపీ పుంజుకుంటుందో లేదో చూడాలి.