Gallery

Home Andhra Pradesh సీఎం జగన్ 24 గంటల ఆదాయం రూ. 300 కోట్లు !

సీఎం జగన్ 24 గంటల ఆదాయం రూ. 300 కోట్లు !

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి .. రాయలసీమ సీనియర్ నేత , టీడీపీ కీలక నేత. ఈయన నోటి వెంట వచ్చే ప్రతి మాట కూడా ఓ సంచలనమే. తాజాగా ఈయన నేడు ఓ మీడియా మీట్ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఒక రోజు ఆదాయం రూ. 300 కోట్లు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఇది ఎంతవరకు నిజమో..? అబద్ధమో..? తెలియదు కానీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు.

Ys Jagan Collecting Detailed Report On Party Leaders 
YS Jagan  

అలాగే ,డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో ఆయన గెలుపొందుతున్నారంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు గురించి కూడా మాట్లాడారు. బాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని.. అయినా వైసీపీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారన్నారు. అక్కడ అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా భయబ్రాంతులకు గురిచేశారన్నారు. చంద్రబాబు ఎలాంటి వారో..? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వారో..? ప్రజలందరికీ బాగా తెలుసన్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలోని పెద్దపల్లిలో జరిగిన అడ్వకేట్ దంపతుల హత్య గురించి జేసీ మాట్లాడారు. అసలు ఈ దంపతుల హత్యలో అన్ని ఆధారాలు వున్నా విచారణ ఎందుకు..? అని జేసీ ప్రశ్నించారు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచనలం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితుడైన బిట్టు శ్రీను అలియాస్‌ తులసిగరి శ్రీనివా‌స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అతడు ఇతర నిందితులతో కలిసి కుట్రలో పాల్గొని, వారికి కారు, కత్తులను అందించినట్టు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

- Advertisement -

Related Posts

ప్రభాస్ సినిమా మొదలు.. మొదట అమితాబ్ మీదనే

ప్రభాస్ చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలే. ప్రతి చిత్రాన్ని జాతీయ స్థాయిలో ఉండేలా రూపొందిస్తున్నారు. 'రాధేశ్యామ్' మొదలుకుని 'సలార్, ఆదిపురుష్' లాంటి ప్రతి చిత్రమూ పాన్ ఇండియా చిత్రమే, అయితే ఒక సినిమా...

మనం నిత్యం వాడే ‘వీటి’ వల్ల కలిగే ఉపయోగాలు !

ఆరోగ్యమే మహాభాగ్యం...ఏం ఉన్నా లేకపోయినా, జీవితానికి అదొక్కటి ఉంటే చాలు. ఆరోగ్యాన్నిచ్చే ఆహారపదార్థాల గురించి తెలుసుకోవటం అవసరం. నిత్యం మనం ఉపయోగించే వాటిలో కొన్నింటి వల్ల కలిగే మేలు గురించి తెలుసుకుందాం. పసుపు: రక్త శుద్ధి...

చిరంజీవి అనుకున్నది …చరణ్ చేస్తున్నాడు

ఇండియాలోని మేటి దర్శకులలో శంకర్ ఒకరు. సమకాలీన సామాజిక సమస్యల మీద ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తుంటారు. భారతీయుడు, జీన్స్, ఒకేఒక్కడు, అపరిచితుడు, రోబో లాంటి సినిమాలతో తన...

Latest News