పవన్ కు కొత్త షాక్: రంగా బావమరిది కీలక వ్యాఖ్యలు!

వారాహియాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్… కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఈ విషయాలపై ఇప్పటికే ముద్రగడ పద్మనాభం.. పవన్ పై లేఖాస్త్రం సంధించారు. ఆ లేఖలో అత్యంత కీలక విషయాలు ప్రస్థావించారు.

ఈ నేపథ్యంలో వంగవీటి రంగా బావమరిది మైకులముదుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖరరెడ్డి రాజకీయ ప్రస్థానం రంగాతోనే ప్రారంభమైందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చెప్పుడు మాటలువిని ఆరోపణలు చేయడం కరెక్ట్‌ కాదంటూ పవన్ కు సూచించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

అవును… కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రాజకీయ ప్రస్థానం దివంగత వంగవీటి మోహన్‌ రంగారావుతోనే మొదలైందని.. ఆయన అభిమానం అప్పటి నుంచి ఇప్పటికీ ఏమాత్రం చెక్కుచెదరలేదని.. చంద్రశేఖరరెడ్డి కాపు వ్యతిరేకి అనడం పచ్చి అబద్ధం అని.. వంగవీటి రంగా బావమరిది చెన్నుపాటి శ్రీనివాస్‌ స్పష్టంచేశా­రు.

దీంతో… కాపు సమాజం విషయంలో ఒక కీలకమైన చర్చ మొదలైంది. సందర్భం లేకుండా ముద్రగడను పవన్ కెలుకున్నారు. అనంతరం ముద్రగడ లేఖాస్త్రం సంధించారు. దీంతో కాపు సమాజంలో రాజకీయంగా చీలకకు అవసరమైన బీటలు వాలుతున్నాయని కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో హరిరామ జోగయ్య రంగప్రవేశం చేసి.. ముద్రగడ వేరు – పవన్ వేరు.. కాపులకు ఎవరికి ఏ నాయకుడు కావాలో వారి వైపు వెళ్లొచ్చు అనే అర్ధం వచ్చేలా స్పందించారు.

ఈ రచ్చ అనంతరం కాపుల్లో చీలకలు కన్ ఫాం.. పవన్ పూర్తిగా బేస్ అయిన ఆ సామాజికవర్గం ఓట్ల విషయంలో పవన్ కు గండిపడినట్లే అనే చర్చ మొదలైపోయింది. ఇదే సమయంలో కాపులు అత్యంత అధికంగా అభిమానించే వంగవీటి రంగా కు ద్వారంపూడి పెద్ద ఫ్యాన్ అని, ఫాలోవర్ అని స్వయంగా… రంగా బావమరిదే మైకుల ముందుకు వచ్చి చెప్పారు.

దీంతో… కాపు సమాజంలో పవన్ పరిస్థితి ఏమిటి, నిత్యం చంద్రబాబు భజన చేస్తూ, ఆయన మనుగడకోసం పనిచేస్తున్న పవన్ ని ఆ సమాజికవర్గంలోకి ప్రజలు ఏ మేరకు నమ్ముతారు అనేది కీలకంగా మారింది. సుమారు 40 ఏళ్లుగా కాపు ఉద్యమాల్లో ఉంటూ, కాపులకు పెద్ద దిక్కుగా ఉన్న ముద్రగడ వైపు కాపులు ఉంటారా.. ఆయన మాటలతో ఏకీభవిస్తూ మాట్లాడిన రంగా బావమరిది మాటలకు విలువ ఇస్తారా… లేక బాబు భజన చేసే పవన్, పవన్ ఏమి చేసినా కరెక్ట్ అనే జోగయ్య ల వైపు ఉంటారా అన్నది వేచి చూడాలి.